పళ్లు రాలగొడతా : రోజా... బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ ఇష్యూపై మాటల యుద్ధం!

By Bojja Kumar

Recommended Video

పళ్లు రాలగొడతా..అంటూ ఫైర్ !

ప్రముఖ సినీ నటి రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ అంశంపై మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగి.... నీ పళ్లు రాలగొడతా అంటే నీ పళ్లు రాలగొడతా అంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. టీవీ9 నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు చాలా తక్కువని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు గారు ఉన్న టైమ్ లో చిరంజీవి వచ్చారు. వీళ్లందరినీ కాదని చిరంజీవి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చాలా కష్టపడ్డారని రోజా చెప్పుకొచ్చారు.

చిరంజీవి వల్లే తమ్ముడు, కొడుకు, మేనల్లుళ్లకు అవకాశాలు

చిరంజీవి వల్లే తమ్ముడు, కొడుకు, మేనల్లుళ్లకు అవకాశాలు

చిరంజీవి వారసత్వంతో, ఆయన చరిష్మాను ఉపయోగించుకుని ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు ఇండస్ట్రీలోకి వచ్చారని, వారు చిరంజీవి కుటుంబ సభ్యులు కాకుంటే వారికి అవకాశాలు ఎవరిస్తారు? వాళ్లకు టాలెంట్ ఉందా? లేదా? అనే విషయం తర్వాత తెలుస్తుంది అని రోజా అన్నారు. ఈ క్రమంలో రోజా మాట్లాడే తీరుతో ఇదే చర్చలో పాల్గొన్న బండ్ల గణేష్ హర్ట్ అయ్యారు.

వాడు వీడు అనొద్దు మేడమ్!

వాడు వీడు అనొద్దు మేడమ్!

"పవన్ కళ్యాణ్ గారిని మీరు వాడు వీడు అంటారేంటి? కళ్యాణ్ బాబుని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా? అలా అనొద్దు మేడమ్, మీరంటే నాకు గౌరవం ఉంది." అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

‘‘మీరంటే కూడా నాకు గౌరవం ఉంది. ఆవేశపడకండి, వినండి'' అంటూ రోజా బండ్ల గణేష్‌ను వారించే ప్రయత్నం చేశారు.

రోజా, బండ్ల గణేష్ మధ్య వాదన

రోజా, బండ్ల గణేష్ మధ్య వాదన

‘‘కళ్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? ఎందుకు ఆయన్ను అలా అంటున్నారు?'' అని బండ్ల గణేష్ ప్రశ్నించారు.

‘‘పవన్ కళ్యాణ్‌ని జగన్ గారు ఏమైనా అన్నారా? జగన్ గారిని పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అంటున్నారు? '' అంటూ రోజా ఎదురు ప్రశ్నించారు.

రెస్పెక్ట్ ఇవ్వండి మేడమ్

రెస్పెక్ట్ ఇవ్వండి మేడమ్

‘‘జగన్ గారిని పవన్ కళ్యాణ్ ఏమన్నాడమ్మా? ఫైట్ చేసి రమ్మన్నాడు..... అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ని వాడూవీడూ అని మీరు అనొచ్చా? రెస్పెక్ట్ ఇవ్వండి మేడమ్.'' అంటూ బండ్ల గణేష్ మండి పడ్డారు.

‘‘వాడూవీడూ అని ఎవరూ మాట్లాడలేదు. మీరు ఆవేశం తగ్గించుకోండి.'' అంటూ రోజా వ్యాఖ్యానించారు.

"మీరు మాట్లాడారు కాబట్టే నేను మాట్లాడాను..." అని బండ్ల గణేష్ చెప్పారు.

పెరిగిన వాగ్వివాదం

పెరిగిన వాగ్వివాదం

"మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా పాయింట్ మాట్లాడటం నేర్చుకోండి." అని రోజా అన్నారు.

"అవునవును. పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యేలు అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు .. ఒకసారి గెలిచారు. మీది గోల్డెన్ లెగ్ అని దేశం మొత్తం కోడై కూస్తోంది. గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్ గారితో ఉండి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా...." అంటూ బండ్ల గణేష్ ఆవేశంతో ఊగిపోయారు.

బండ్ల గణేష్ ఆ మాట అనడంతో సహనం కోల్పోయిన రోజా

బండ్ల గణేష్ ఆ మాట అనడంతో సహనం కోల్పోయిన రోజా

"గెలవడం, ఓడిపోవడం పాలిటిక్స్‌లో సహజం. గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం. మీరేమీ నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు." అని రోజా అన్నారు.

"రాజశేఖరరెడ్డిగారిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి.." అంటూ బండ్ల గణేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

పళ్లు రాలగొడతా’ అంటూ రోజా ఆగ్రహం, ‘నీ పళ్లు రాలిపోతాయి’ అంటూ బండ్ల గణేష్ కౌంటర్

పళ్లు రాలగొడతా’ అంటూ రోజా ఆగ్రహం, ‘నీ పళ్లు రాలిపోతాయి’ అంటూ బండ్ల గణేష్ కౌంటర్

ఈ క్రమంలో బండ్ల గణేష్, రోజా మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో రోజా తీవ్ర ఆగ్రహానికి గురై ఏం మాట్లాడుతున్నావ్.... ‘పళ్లు రాలగొడతా' అంటూ ఫైర్ అయ్యారు.

‘నీ పళ్లు రాలిపోతాయి' అంటూ బండ్ల గణేష్ కూడా అదేస్థాయిలో రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు బూతులు ప్రయోగించుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X