ఎన్టీఆర్ రేపటి నుంచి రోడ్ షోలకు వెళ్ళతున్నాడని భయపడే చిరంజీవి రాజమండ్రిలో భారీ సభ నిర్వహించారని తెలుగు మహిళా అధ్యక్ష్యురాలు రోజా విమర్శించారు. ఇంతకుముందు సినిమాల్లో కూడా ఎన్టీఆర్ వచ్చాకే చిరంజీవికి వరస ఫ్లాపులు వచ్చాయని, ఆయన చాలా కాలం ఆ ప్రస్టేషన్ లో ఉండిపోయారని వ్యాఖ్యానం చేసారు. అనంతరం ఎన్టీఆర్ మెగాస్టార్ అయ్యారని, చిరు వెనకపడిపోయారని, రాజకీయాల్లోనూ అదే జరుగుతుందని భయపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవి..మహాకూటమికి భయపడి ఓ సామాజిక వర్గాన్ని విడతీస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ రోజు ఓ ప్రైవైటు ఛానెల్ తో మాట్లాడుతూ ఎన్టీఆర్ వస్తున్నారని,విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేసారు.