ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ ఉమ్మడి గుర్తు కూడా లేని ప్రజారాజ్యం పార్టీ ఓ పార్టీ యేనా అని తెలుగు మహిళ అధ్యక్ష్యురాలు రోజా వ్యాఖ్యానించారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో మంగళవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని పనికిరాని పార్టీగా ఆమె అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేయాల్సిన స్ధితిలో ఆ పార్టీ ఉందని ఎద్దేవా చేసారు. ఆ పార్టీ నాయకులకు అసలు విలువలు లేవని,ఇంట్లో ప్రింటింగ్ మిషన్లు పెట్టుకుని విచ్చలవిడిగా ఫ్లెక్సి బోర్డుల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. చిరంజీవి తూర్పు గోదావరి జిల్లాలో మొహం చెల్లక తిరుపతి నుంచి పోటీకి దిగటం హాస్యాస్పదమన్నారు.