ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి దమ్ము, ధైర్యం ఉంటే కడపలో పోటీ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్ష్యురాలు రోజా సవాల్ విసిరారు. గత కొంతకాలంగా రోజా చిరంజీవినే టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కడపలో చిరంజీవి తొడ గొట్టి మీసాలు మెలివేశారని, అవినీతిని అంతం చేస్తానన్న ఆయన అవినీతి ప్రారంభమైన కడపలో పోటీచేసి గెలవాలన్నారు. 1983లో ఎన్.టి.రామారావు చైతన్య రధ యాత్ర ప్రారంభించినప్పుడు ఎలాంటి ఏసీ వాహనాలను వాడలేదన్నారు. ఇప్పుడు చిరంజీవి యాత్ర చేస్తున్నది ఏసీ వాహనాల్లో కాదా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యంలో చేరిన వారు ఒక్కొక్కరే బయటకు వచ్చేస్తున్నారని ఆమె అన్నారు.