చిరు రాజకీయంపై రోజాభిప్రాయం
అభిమానుల సంగతేమో కానీ రాజకీయ నాయకులు మాత్రం చిరంజీవి రాజకీయాలలోకి రావద్దనే బలంగా కోరుకుంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే సీన్ అంతా మారిపోతుంది-ఇప్పటికే రాజకీయ నాయకులు వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారు అవుతున్నాయి. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే తమ భవిత్యం ఏం కానని బెంగపడుతున్నారు. ఇలా బెంగపడుతున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఉంది. తెలుగుదేశం తరపున గత ఎన్నికలలో పోటీపడినప్పటికీ విజయం వాకిట బొల్తాపడడంతో రోజా రానున్న ఎన్నికలలో విజయం సాధించి తన కల సాకారం చేసుకోవాలని తపన పడుతోంది.
ఈ తరుణంలో చిరంజీవి రాజకీయాలలోకి వస్తే తెలుగుదేశం పరిస్థితి ఏమైపోనున్నదోననే బెంగ రోజాకు పట్టుకుంది. అందుకే ఈ మధ్య చెన్నయ్ లో ఒక పెళ్లికి హాజరైన రోజా చిరంజీవి రాజకీయ అరంగేట్రంపై ఒక వివాదాస్పద ప్రకటన చేసింది. చిరంజీవి రాజకీయాలలోకి రావద్దని, ఈ సమయంలో కులం బేస్ రాజకీయాలను కడిగివేయాలనుకుంటున్న తరుణంలో ఆయన రావద్దని అంది. ఇది చిరంజీవి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కులం బేస్ మీదనే తాను రాజకీయాలలోకి వస్తానని ప్రకటన ఏమీ చేయని చిరంజీవికి మరెంత కోపం వచ్చిందో ఊహించుకోండి.


Click it and Unblock the Notifications











