నల్లగా, లావుగా అయిపోతున్నానంటూ...రోజా
అందంగా ఉండే నువ్వు నల్లగా, లావుగా అయిపోతున్నావంటూ చాలామంది నన్ను ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చాలా బాధేసింది. అందుకే మళ్లీ నాజూగ్గా తయారయ్యాను అంటున్నారు రోజా. సన్నబడ్డారేంటని మీడియావారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పై విధంగా స్పందించారచు. అలాగే...రాజకీయాలకు గ్లామర్ అవసరం లేదు. సినిమా అంటే కచ్చితంగా అందంగా ఉండాలి. అందుకే బాగా కష్టపడి సన్నబడ్డాను. గోలీమార్‌తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్లుంది అన్నారు. అలాగే టీవీ మీడియాకి వచ్చి చేస్తారా అంటే...టాక్ షోలకు గెస్ట్ గా రమ్మంటే వస్తానుగానీ సీరియల్స్ ల్లో నటించడమంటే నాకు నచ్చదు. సీరియల్స్ అంటే ఎక్కువగా ఏడుస్తూ ఉండాలి. లేదా విలన్ గా నటించాలి. ఈ రెండూ నా మనస్తత్వానికి సరిపడవని రోజా చెప్పారు. ఇటీవలే విడుదలైన 'గోలీమార్' చిత్రంలో ప్రియమణి తల్లిపాత్ర పోషించారీమె.
రోజా గోలీమార్ పూరీ జగన్నాధ్ ప్రియమణి శంభో శివ శంబో roja gopichand golimaar puri jagannath priyamani bellamkonda suresh


Click it and Unblock the Notifications