twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్టింగ్ కౌచ్‌పై రోజా స్పందన.. ఆశ పడిన వారే తిరిగి అలా.. ఫైర్ బ్రాండ్ సంచలనం

    |

    Recommended Video

    Roja Sensational Comments In Her Latest Interview || Filmibeat Telugu

    సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ అంతుపట్టని అంశం కాస్టింగ్ కౌచ్‌. తెలుగు సినిమా పరిశ్రమకు ఓ వైపు కొత్త నటీనటుల రాక వెల్లువెత్తుతుండగా.. మరో వైపు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఇక ఇటీవలే సినీ పెద్దల లైంగిక వేధింపులపై శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ఏకంగా నడిరోడ్డుపై బట్టలిప్పి నానా రచ్చ చేసినా విషయం కొలిక్కి రాలేదు. దీంతో ఏ సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరిగినా అందులో కాస్టింగ్ కౌచ్‌పై మీ స్పందనేంటి? ప్రశ్న ఖచ్చితంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు కూడా అదే ప్రశ్న ఎదురుకాగా తనదైన కోణంలో సమాధానం చెప్పింది. వివరాల్లోకి పోతే..

    సినిమా పరిశ్రమకు పెద్దగా నా ఆలోచన

    సినిమా పరిశ్రమకు పెద్దగా నా ఆలోచన

    ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దగా తమ్మారెడ్డి భరద్వాజ కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో సీనియర్ కావడంతో ఆయనకు అన్ని అంశాలపై అవగాహన ఉంది. అందుకే 'నా ఆలోచన' అనే కార్యక్రమం ద్వారా సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాను ఇంటర్వ్యూ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ.

    రోజా ఓపెన్ సమాధానాలు

    రోజా ఓపెన్ సమాధానాలు

    ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను రోజా నుండి రాబట్టే ప్రయత్నం చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా, రాజకీయ అంశాల పట్ల తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేశారు. అయితే ఆయన సంధించిన ఈ ప్రశ్నలపై ఎలాంటి బెరుకు లేకుండా చాలా ఓపెన్ గా సమాధానం చెప్పేసింది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.

    రెండోసారి ఎమ్మెల్యే కావడంపై

    ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి నగరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది రోజా. దీనిపై స్పందించిన రోజా.. తనకు ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ, పోయిన సారి గెలవడం ఒక ఎత్తు అయితే ఈ సారి గెలవడం మరో ఎత్తు అని పేర్కొంది రోజా. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో చాలా విషయాలపై ఫైట్ చేయడం కారణంగా చంద్రబాబు నాయుడు నన్ను అసెంబ్లీకి రానీయొద్దని కంకణం కట్టుకున్నారు. కానీ వాటిని తిప్పికొట్టి గెలవడం హ్యాపీ అని రోజా చెప్పింది.

    ఆ వెంటనే సినీ లైంగిక వేధింపులపై

    ఆ వెంటనే సినీ లైంగిక వేధింపులపై

    హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఉన్నాయని అంటున్నారు కదా.. దీనిపై స్పందన ఏంటి? అని తమ్మారెడ్డి అడగగానే.. ''నేను ఇంతకు ముందు కూడా గత ఇంటర్వ్యూల్లో చెప్పాను. క్యాస్టింగ్ కౌచ్ లాంటి కష్టాలు నాకైతే రాలేదు. ఫస్ట్ సినిమా నుండి నా జర్నీ చాలా స్మూత్‌గా సాగింది. కాంపిటేషన్ అయితే ఉంటుంది కాని.. వేధింపులు అయితే నాకు ఎదురుకాలేదు'' అని తెలిపింది.

     లొంగిపోతారు.. తిరిగి అభియోగాలు చేస్తారు

    లొంగిపోతారు.. తిరిగి అభియోగాలు చేస్తారు

    కేవలం సినిమా ఇండస్ట్రీయే కాదు నాకు తెలిసి అన్ని చోట్ల ఈ హరాస్మెంట్ అనేది ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఎలాగైనా ఇండస్ట్రీలో పైకి రావడమే ధ్యేయంగా ఇలాంటి వాటికి లొంగిపోతారు. సో వాళ్ళే లొంగిపోయి వాళ్ళే తిరిగి ఇలాంటి అభియోగాలు మోపడం నా దృష్టిలో కరెక్ట్ కాదు అని రోజా తెలపడం విశేషం.

    English summary
    Senior heroine Roja says her feelings on Sexual harassments in telugu film industry. In latest interview with Bharadwaja Thammareddy programme she talk about this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X