Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాస్టింగ్ కౌచ్‌పై రోజా స్పందన.. ఆశ పడిన వారే తిరిగి అలా.. ఫైర్ బ్రాండ్ సంచలనం
Recommended Video
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ అంతుపట్టని అంశం కాస్టింగ్ కౌచ్. తెలుగు సినిమా పరిశ్రమకు ఓ వైపు కొత్త నటీనటుల రాక వెల్లువెత్తుతుండగా.. మరో వైపు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఇక ఇటీవలే సినీ పెద్దల లైంగిక వేధింపులపై శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ఏకంగా నడిరోడ్డుపై బట్టలిప్పి నానా రచ్చ చేసినా విషయం కొలిక్కి రాలేదు. దీంతో ఏ సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరిగినా అందులో కాస్టింగ్ కౌచ్‌పై మీ స్పందనేంటి? ప్రశ్న ఖచ్చితంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు కూడా అదే ప్రశ్న ఎదురుకాగా తనదైన కోణంలో సమాధానం చెప్పింది. వివరాల్లోకి పోతే..
సినిమా పరిశ్రమకు పెద్దగా నా ఆలోచన
ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దగా తమ్మారెడ్డి భరద్వాజ కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో సీనియర్ కావడంతో ఆయనకు అన్ని అంశాలపై అవగాహన ఉంది. అందుకే 'నా ఆలోచన' అనే కార్యక్రమం ద్వారా సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాను ఇంటర్వ్యూ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ.
రోజా ఓపెన్ సమాధానాలు
ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను రోజా నుండి రాబట్టే ప్రయత్నం చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా, రాజకీయ అంశాల పట్ల తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేశారు. అయితే ఆయన సంధించిన ఈ ప్రశ్నలపై ఎలాంటి బెరుకు లేకుండా చాలా ఓపెన్ గా సమాధానం చెప్పేసింది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.
రెండోసారి ఎమ్మెల్యే కావడంపై
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి నగరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది రోజా. దీనిపై స్పందించిన రోజా.. తనకు ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ, పోయిన సారి గెలవడం ఒక ఎత్తు అయితే ఈ సారి గెలవడం మరో ఎత్తు అని పేర్కొంది రోజా. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో చాలా విషయాలపై ఫైట్ చేయడం కారణంగా చంద్రబాబు నాయుడు నన్ను అసెంబ్లీకి రానీయొద్దని కంకణం కట్టుకున్నారు. కానీ వాటిని తిప్పికొట్టి గెలవడం హ్యాపీ అని రోజా చెప్పింది.
ఆ వెంటనే సినీ లైంగిక వేధింపులపై
హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఉన్నాయని అంటున్నారు కదా.. దీనిపై స్పందన ఏంటి? అని తమ్మారెడ్డి అడగగానే.. ''నేను ఇంతకు ముందు కూడా గత ఇంటర్వ్యూల్లో చెప్పాను. క్యాస్టింగ్ కౌచ్ లాంటి కష్టాలు నాకైతే రాలేదు. ఫస్ట్ సినిమా నుండి నా జర్నీ చాలా స్మూత్‌గా సాగింది. కాంపిటేషన్ అయితే ఉంటుంది కాని.. వేధింపులు అయితే నాకు ఎదురుకాలేదు'' అని తెలిపింది.
లొంగిపోతారు.. తిరిగి అభియోగాలు చేస్తారు
కేవలం సినిమా ఇండస్ట్రీయే కాదు నాకు తెలిసి అన్ని చోట్ల ఈ హరాస్మెంట్ అనేది ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఎలాగైనా ఇండస్ట్రీలో పైకి రావడమే ధ్యేయంగా ఇలాంటి వాటికి లొంగిపోతారు. సో వాళ్ళే లొంగిపోయి వాళ్ళే తిరిగి ఇలాంటి అభియోగాలు మోపడం నా దృష్టిలో కరెక్ట్ కాదు అని రోజా తెలపడం విశేషం.