మగాడి చేతిలో మోసపోయినా...రోజా

By Srikanya

మగాడి చేతిలో మోసపోయినా భయపడక ధైర్యంగా జీవితంలో ముందడుగు వేసిన ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. బయట నేను ఎలా ఉంటానో అలాంటి పాత్రే 'గోలీమార్'లో చేసా అంటూ మురిసి పోతోంది రోజా. రాజకీయాల్లో నన్ను రెబల్‌ గా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో అలాంటి రెబల్ లేడీగా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను చేసిన ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి చాల చక్కని స్పందన వచ్చింది. అలాగే హీరోయిన్ ప్రియమణి తల్లిగా చేయాలంటే మొదట సందేహించా. అయితే తల్లి పాత్రల్ని కూడా హీరోయిన్ ‌గా చూపించే నైపుణ్యం డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లో ఉంది.

పూరీ జగన్నాధ్ 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమా అందుకు చక్కని ఉదాహరణ. అందుకే 'గోలీమార్'లో ఆ పాత్ర చేశా. హీరోయిన్‌ గా ఎప్పుడూ ఆ అవకాశం నాకు రాలేదు అంటోంది. 'శంభో శివ శంభో' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి రోజా 'గోలీమార్'లో మగాళ్లంటే గిట్టని ఓ పవర్ ఫుల్ మహిళ పాత్రలో రాణించారు. గోపీచంద్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ ప్రియమణికి తల్లిగా నటించారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X