'మొగుడు'తో రోజా కోరిక తీరింది
రోజా ఒకప్పుడు హాట్ హీరోయిన్.పెద్ద స్టార్స్ అందరి సరసన చేసిన ఆమె ఒక తరాన్ని ఉర్రూతలూగించింది.ఇక తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ లో మొగుడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.ఆ చిత్రంలో హీరోయిన్ తల్లిగా రోజా చేసింది.ఆమెకు ఎప్పటినుంచో కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనే కోరిక.అది తీరటం ఒకెత్తు అయితే ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్..అది కూడా ఈ చిత్రంతో తీరింది అంటున్నారు.ఈ చిత్రంలో రోజాది మంత్రి పాత్ర.ఇక రోజా వంటి సీనియర్ నటి నటించటం వల్ల ఆ పాత్రకు నిండుతనం వచ్చిందని అంటున్నారు.సినిమా రిజల్టు నెగిటివ్ గా ఉన్నా రోజా పాత్ర మాత్రం హైలెట్ అయ్యింది.ఆ పాత్ర స్పూర్తితో ఆమెకు మరిన్ని పాత్రలు వస్తాయంటున్నారు.నెగిటివ్ గా కనిపించే సాప్ట్ రోల్ మినిస్టర్ పాత్ర అది.ఇక ఇంతకుముందు కూడా ఆమె రవితేజ హీరోగా చేసిన శంభో శివ శంబో చిత్రంలో ఇటువంటి తరహా పాత్రనే చేసింది.కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.అయితే ఈ సినిమా మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవటంతో ఆమె పాత్ర గురించి అందరిలో హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఆమె శ్రీరామ రాజ్యంలో నూ భూదేవి గా ఓ కీలకమైన పాత్రనే చేస్తోంది.ఇటువంటి పొలిటేషన్ పాత్రలు వస్తే ఆమె ఎట్టి పరిస్ధితిల్లోనూ వదులుకోదు అంటున్నారు.


Click it and Unblock the Notifications











