మళ్లీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి..రోజా
సీతారత్నంగారి అబ్బాయిలో నా పాత్రకు అప్పట్లో ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ సినిమాను తీసిన ప్రాంతంలోనే ఈ సినిమా కూడా తీశారు. ఇందులో నా పాత్రపేరు సీతారత్నం. మళ్లీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అంటోంది రోజా. ఆమె తాజాగా నటించిన 'కోడి పుంజు" సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్ లో ఆమె ఇలా స్పందించారు. అలాగే..'కోడి పుంజు"లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడానికి వెనుక, ముందు అయ్యాను. ఇప్పుడు ఫోన్లు చేసి అందరూ అభినందిస్తుంటే ఆ కష్టం మొత్తం మరిచిపోయినట్టు అయ్యింది. అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టే ఈ విజయం అని చెప్పింది.
తనీష్ హీరోగా, బీవీవీ చౌదరి దర్శకత్వంలో 'కోడి పుంజు"రూపొందింది. ఈ చిత్రాన్ని డీఎస్‌రావు నిర్మించారు. ఆయన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అపూర్వమైన స్పందన లభిస్తోందని చిత్రనిర్మాత డీఎస్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కథ విన్నప్పుడు పాత్రలన్నీ సజీవంగా కనిపించాయి. దగ్గుపాటి సీతారత్నంగా రోజా నటించిన తీరుకు ప్రేక్షకుల్లో మంచి అప్లాజ్ వస్తోంది. తనీష్ సినిమాకు ఇంత ఓపెనింగ్స్ మేం ఊహించలేదు. అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వస్తున్నాయి అని అన్నారు.దర్శకుడు బీవీవీ చౌదరి, నటుడు శివకృష్ణ, పొట్టి రాంబాబు, చైతన్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











