చెన్నై: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు రోజా భర్త ఆర్కే సెల్వమణిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎల్టీటీఈ మద్దతుదారుడు సీమాన్‌ను విడుదలజేయాలంటూ ధర్నాకు దిగినందుకు ఆయన్ను అరెస్టు చేసారు. కొద్దిరోజుల క్రితం ఎల్టీటీఈకి మద్దతుగా మాట్లాడినందుగ్గాను దర్శకుడు సీమాన్‌ను పుదుచ్చేరి ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసారు. ఇక ఆర్కే సెల్వమణి...రోజా హీరోయిన్ గా చంబరతి(చామంతి)చిత్రం రూపొందించి అప్పట్లో హిట్ కొట్టారు. అలాగే విజయ్ కాంత్ హీరోగా వీరప్పన్ జీవిత చరిత్ర ప్రేరణతో పోలీస్ అధికారి చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించారు. అనంతరం రోజా తోటే సమరం అనే చిత్రం తీసారు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత తమిళనాడు నిర్మాతల మండలి వారు స్వయంగా పెట్టుకున్న ఛానెల్ కోసం పనిచేసారు. అయితే రోజా, సెల్వమణి గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారని సమాచారం. ఇక ఈ విషయమై రోజా ఏమీ స్పందిచలేదు.