అమ్మోరు తల్లి ...రోజా

అందులో ఆమె ఒక దేవత పాత్రని పోషించారు. ఈ భక్తిరస చిత్రానికి దర్శకుడు జ్ఞానమ్. కథ మొత్తం వక్రకాళి అమ్మన్ అనే గ్రామ దేవత చుట్టూ తిరుగుతుంది. చెన్నై నుంచి 80 కిలో మీటర్ల దూరంలోని తిరువక్కరై గ్రామ దేవత ఆమె. తన భక్తులకి ఆ దేవత ఎలాంటి మహిమలు చూపిస్తుందీ, వాళ్లని ఎలా కాపాడుతూ వుంటుందనేది ఈ చిత్ర కథ. రెగ్యులర్ కథ అయినా రొటీన్ గా ఉండదంటున్నారు. ఈ చిత్రానికి మిస్టర్ ఎక్స్ అనే నూతన సంగీత దర్శకుడు దీనికి సంగీతం సమకూర్చాడు. ఇక దీనిని తెలుగులోకి డబ్బింగ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారట. అంటే త్వరలో ఆమె మహిమలు మనమూ చూడబోతున్నామన్నమాట.


Click it and Unblock the Notifications











