రజనీకాంత్ హీరో కాదు జీరో.. పవన్ కల్యాణ్‌ను బెదిరించేందుకే ఇలా.. నాని, రోజా కామెంట్స్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే రజనీ కాంత్ ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజనీ కాంత్ చేసిన వాఖ్యలపై కొడాలి నాని, రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రపంచ రాజకీయాలు: ఇటీవల విజయవాడలో నిర్వహించిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీ కాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు తలైవా. "చంద్రబాబు 30 ఏళ్ల నుంచి మిత్రుడు. మోహన్ బాబు నాకు పరిచయం చేశారు. చంద్రబాబుతో మాట్లాడుతుంటే నాకు ఎంతో జ్ఞానం పెరిగింది. ఇండియన్ పాలిటిక్సే కాదు ప్రపంచ రాజకీయాలు తెలుసు" అని రజనీ కాంత్ అన్నారు.

Roja

ఏపీ స్థానం ఎక్కడికో..: "హైదరాబాద్ అభివృద్ధి చూసి బిల్ గేట్స్ వంటి వాళ్లు వచ్చారు. మొన్న జూబ్లిహిల్స్, బంజారా హిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. హైదరాబాద్ లో ఉన్నామా.. విదేశాల్లో ఉన్నామా అనిపించింది. ఏపీలో భవిష్యత్తులో 2047 అంటూ ఓ ప్రణాళికతో చంద్రబాబుకు ముందుకు సాగుతున్నారు. అదే జరిగితే ఇండియాలో ఏపీ స్థానం ఎక్కడికో వెళ్లిపోతుంది" అని రజనీ కాంత్ చెప్పుకొచ్చారు.

Roja

రజనీ కాంత్ ఓ జీరో: తాజాగా రజనీకాంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన రజనీకాంత్ పై మండిపడ్డారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను రజనీకాంత్ చదివి స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్లే ఇవాళ పొగుడుతూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రజనీ కాంత్ ను ఓ జీరో అంటూ తెగ ఫైర్ అయ్యారు.

Roja

డబ్బా కబుర్లు: "పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే రజనీకాంత్ ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిణామాలు చూసైనా చంద్రబాబు రాజకీయం పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి. శాలువాలు కప్పించుకోవడానికి వ్చిన రజనీకాంత్ డబ్బా కబుర్లు చెప్పారు. అవన్నీ మీ సినిమాల్లో నడుస్తాయి. ఆ డబ్బా కబుర్లు నమ్మేవాళ్లు ఎవరు లేరు" అని కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Roja

అప్పుడేం చేశారు: "ఇప్పుడు రజనీ కాంత్ సినిమాలు కూడా ఆడే పరిస్థితి లేదు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే పరిస్థితి. ఎన్టీఆర్ పై చెప్పలు విసురుతుండగా వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడటం సిగ్గు చేటు. ఎన్టీఆర్ బతికి ఉండగా రజనీ కాంత్ ఏం చేశాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు" అని నాని ప్రశ్నించారు.

సీఎంగా ఉన్నప్పుడు: "ఎన్టీఆర్ జయంతి సభలో రజనీకాంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన బాబును పొగడటం విడ్డూరంగా ఉంది. సభకు పిలిచారు కాబట్టి బాబును పొగిడినట్లుగా ఉంది. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్ను పోటు పొడిచింది రజనీ కాంత్ కు తెలియదా. బాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్ కు భారత రత్న అంశం గుర్తుకు రాదు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ చావుకు కారణం బాబు. 2013 వరకే బాబు హైదరాబాదుకు సీఎంగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు బాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తించాలి" అని రోజా విమర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X