రోజా డైమండ్ జ్యూయలరీ దొంగతనం
నటి మరియు రాజకీయనాయకురాలైన రోజా రీసెంట్ గా లక్షల విలువ చేసే ఆమె డైమండ్ జ్యూయలరీని పొగొట్టుకున్నారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణంలో ఇవి మిస్సైనట్లు ఆమె గుర్తించారు. ఆమె విజయవాడలో ఓ మీటింగ్ లో పాల్గొని సికింద్రాబాద్ వస్తూండుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణంలో ఆమె తన చెవులుకు ఉన్న డైమండ్ ఇయిర్ రింగ్స్,నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి బ్యాగ్ లో ఆ నగలు లేవు. అయితే ఆమె హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకునేదాకా ఆ నగలు దొంగతనం జరిగినట్లు గమనించలేదు. వెంటనే ఆమె దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై కంప్లైంట్ చేసారు.
పోలీసులు ప్రస్తుతం ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది.


Click it and Unblock the Notifications











