రోజా రసగుల్ల లాగా...
ఏంటీ "భోషానం" లా వున్న రోజా ఈ మధ్య కాస్త స్లిమ్ గా తయారయిందీ. . . ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక చిక్కిపోయిందా అనుకుంటే మీరు "తప్పులో కాలేసినట్టే". మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండీ తెదేపా తరపున పోటీచేసి ఓటమి పాలైన రోజా మళ్లీ సిల్వర్ స్ర్కీన్ పై కనిపించేందుకు సిద్ధమౌతోందట. తెలుగు దేశం మహిళా విభాగ అధ్యక్షురాలిగ ఎప్పుడూ సంచలనకరమైన వార్తలకు కేంద్రబిందువుగా బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలవడంతో, రాజకీయాలకన్నా సినిమాలే బెటరనుకున్నారో ఏమో, ఇప్పుడు సినిమాల్లో నటించడంపై దృష్టి సారిస్తున్నారట. బెల్లంకొండ సురేష్ నిర్మిచబోతున్న తమిళచిత్రం "నాడోడిగల్" రీమేక్ "శంభో శివ శంభో" తో రోజా రీ-ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రోజా కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











