రోజా ఇలా కావడానికి కారణం ఆయనే.. అప్పుడే చెప్పాడట.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర విషయాలు

సినీ నటిగా, రాజకీయ వేత్తగా రోజా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది. కొన్ని దశాబ్దాల పాటు స్టార్ హీరయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. వెండితెరపై వినోదాల విందు పంచింది. స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడి అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఆ తర్వాత రాజీకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. అయితే ఆమె కెరీర్ ఎలా స్టార్ట్ అయింది. ఆమె ఇలా ఉండటానికి కారణం ఎవరు? ఆసక్తికర విషయాలు మీ కోసం..

ఆయన కన్నుమూయడంతో

ఆయన కన్నుమూయడంతో

రోజా కెరీర్ లో కీలక భూమిక పోషించిన వ్యక్తి శివప్రసాద్ అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆయన శనివారం కన్నుమూయడంతో రోజాతో ఆయనకున్న అనుబంధం తాలూకు విషయాలు బయటకొచ్చాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నారమల్లి శివప్రసాద్ స్వయంగా రోజా గురించి చెప్పిన కొన్ని విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తి నింపాయి.

 తిరిగిరాని లోకాలకు శివప్రసాద్

తిరిగిరాని లోకాలకు శివప్రసాద్

సినీ నటుడు, డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నేత, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ శనివారం రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హీరోయిన్‌ రోజా పరిచయం

హీరోయిన్‌ రోజా పరిచయం

సినీ ఇండస్ట్రీతో శివప్రసాద్‌కి గొప్ప అనుభందం ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. సీనియర్ హీరోయిన్‌ రోజాను తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా పరిచయం చేసింది కూడా ఆయనే.

ప్రేమ తపస్సు.. శివప్రసాద్‌ ఎగతాళి

ప్రేమ తపస్సు.. శివప్రసాద్‌ ఎగతాళి

రోజాను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘ప్రేమ తపస్సు' అనే సినిమా తీశారు శివప్రసాద్. ఆ రోజుల్లో సినిమాలపై ఎంతో ఇంట్రెస్ట్ చూపిన ఆయన రోజాను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. రోజాను పరిచయం చేస్తున్న ఆ రోజుల్లో ఆమెనెలా తీసుకున్నావని శివప్రసాద్‌ని చాలామంది ఎగతాళి చేశారట. గతంలో ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు.

 కరెక్ట్‌ అమ్మాయి రోజానే అని ఫిక్స్ అయి..

కరెక్ట్‌ అమ్మాయి రోజానే అని ఫిక్స్ అయి..

ఓ కొత్త హీరోయిన్‌‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాయలసీమలో చాలా కాలేజీలు వెతికీ వెతికీ చివరకు తాను అనుకున్న పాత్రకు కరెక్ట్‌ అమ్మాయి రోజానే అని ఫిక్స్ అయ్యారట శివప్రసాద్. ఆమె అభినయం చూసి అప్పట్లోనే రోజా స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అని కూడా చెప్పానని గతంలో జరిగిన ఇంటర్వ్యూలో శివప్రసాద్‌ వెల్లడించారు.

శివప్రసాద్‌ మరణం.. రోజా మెసేజ్

శివప్రసాద్‌ మరణం.. రోజా మెసేజ్

ఇక శనివారం శివప్రసాద్‌ మరణించారనే వార్త తెలిసి రోజా మనస్థాపానికి గురైంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతాపం ప్రకటిస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. శివప్రసాద్‌ మరణ వార్త విని ట్విట్టర్ ద్వారా రోజా ఓ మెసేజ్ పెట్టింది రోజా.

చాలా బాధాకరం అంటూ..

''చిత్తూరు జిల్లా నాయకులు, టిడిపి మాజీ ఎంపీ మరియు నా తోటి నటులు నాకు గురువు సమానులు శివప్రసాద్ గారు అనారోగ్యంతో మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను'' అని రోజా ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X