రోజాతో మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ.. జబర్దస్త్ జడ్జ్ సరికొత్త రికార్డు
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌లను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది రోజా. జబర్దస్త్ జడ్జిగా భారీ పాపులారిటీ సంపాదించిన ఈమె ఏకంగా టాప్ స్టార్ హీరోలతో పోటీపడటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వాళ్ళతో రోజాకి పోటీ ఏంటి? అసలు విషయంలోకి వస్తే..

ఆన్‌లైన్ వెదికపై రోజా హంగామా
పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ మధ్యకాలంలో టీవీల్లో వచ్చే షోస్, కొత్త సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ ఆన్‌లైన్ వెదికపై హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ జడ్జ్‌గా రోజా ఆన్‌లైన్ వెదికపై తెగ హంగామా చేస్తోంది. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో పోటీ పడింది.

ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు
న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు' అనే స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాంను రోజా సింగిల్‌గా నడిపించి ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. ఇందులో కమెడియన్స్, సింగర్స్,డాన్స్ మాస్టర్స్,హాట్ యాంకర్స్, రోజా ఇలా అందరూ తెగ హంగామా చేసి బుల్లితెర ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

మహేష్ బాబు, అల్లు అర్జున్‌పై రోజా
దీంతో ఇదే ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు' ప్రోగ్రాం ఆన్‌లైన్ వెదిక యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అంతేకాదు ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది. కేవలం ఒక్కరోజునే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రెండో స్థానం లోకి వచ్చేసింది ఈ ప్రోగ్రాం. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో పాటలను వెనక్కినెట్టి రావడం విశేషం.

సినిమాలతో పోటీ పడి.. రోజా పైచేయి
ప్రస్తుతం రోజా ప్రోగ్రాం 'ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు' యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉండగా.. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ మూడో స్థానంలో అదేవిధంగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సామజవరగమన సాంగ్ ఇదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇలా సినిమాలతో పోటీ పడి రోజా సరికొత్తగా రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











