పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు: అక్కడి వెంట్రుకలు కూడా పీకలేడు.. అదే జరిగితే నీ ప్రాణం పోతుంది అంటూ!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. అలాంటిది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంట్రీతో అవి ఇంకాస్త రంజుగా మారాయి. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల తరపున పోరాటం చేస్తోన్న ఈ స్టార్ హీరో.. తరచూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం ఖాయం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే...

వైసీపీని గెలవనివ్వమని ఛాలెంజ్
ఇప్పటం గ్రామంలో ప్రముఖ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన 'మీరు మా ఇప్పటం గ్రామస్థుల గడపలు కూల్చారు. నా గుండెల్లో గునపం దించారు. ఇప్పటంలో కొట్టిన ప్రతి గడపా నా గుండెల మీద కొట్టినట్లే. సజ్జలా.. మీకు చాలెంజ్ చేస్తున్నా.. 2024లో మీరెలా గెలుస్తారో చూస్తాం' అంటూ ఛాలెంజ్ విసిరారు.

పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని పవన్ కల్యాణ్ చేసిన ఛాలెంజ్‌పై మంత్రి రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీడియా వాళ్లకూ చెబుతున్నాను.. పవన్ కల్యాన్ గారికీ చెబుతున్నాను.. ఆయన వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్లకూ చెబుతున్నాను. జగన్ గారిని కాదు కదా.. ఆయన ఎడమకాలిపై ఉన్న వెంట్రుకలు కూడా వీళ్లు పీకలేరు' అని ఫైర్ అయ్యారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది
ఆ తర్వాత రోజా కంటిన్యూ చేస్తూ.. 'ఇప్పటంలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టు లాగిపెట్టి లెంపకాయ కొట్టిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బుద్ది కూడా మార్చుకోకపోతే ఎలా? ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది. అసలు వాస్తవాన్ని హైకోర్టు కూడా అర్థం చేసుకుని వారికి జరిమానా విధించింది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గారు గ్రహించాలి' అంటూ పవన్‌కు సూచించారామె.

పవన్ కల్యాణ్‌ను ఫూల్‌ను చేశారు
అనంతరం రోజా 'ఇప్పటంలో సమస్యకు చంద్రబాబే కారణం. అక్కడ సమస్య వస్తే ఆయనో లేక లోకేష్ వెళ్లాలి. కానీ, అక్కడకు పవన్‌ను పంపించి.. జగన్ గారిని తిట్టించడమేంటి? పవన్‌ను చంద్రబాబు వాడుకుని ఫూల్‌ను చేస్తున్నారు. సమస్యకు కారకులైన చంద్రబాబును వదిలేసి.. జగన్ గారి మీద విరుచుకుపడటం చూస్తే.. పవన్ ఉనికి కోసమే చేస్తున్నారనిపిస్తుంది' అన్నారు.

పవన్ కల్యాణ్ గతం అంటే అదే
ఇక, పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఓడిపోవడంపై రోజా వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. 'వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ గతం గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. ఆయన గతం అంటే అదే. ఒక్కచోట కూడా గెలవలేని నాయకుడు.. భారీ మెజార్టీతో గెలిచిన వాళ్లను విమర్శిస్తారా' అని ప్రశ్నించారు.

పవన్ కల్యాన్‌కు రోజా ఛాలెంజ్
రోజా కొనసాగిస్తూ.. 'జనసేనాని పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీలో దింపాలి. అలా పోటీ చేసినప్పుడే నువ్వు హీరోవి అవుతావు. అలా కాకుండా సినిమాల్లో హీరో వేషాలు వేసి.. ఇక్కడ జీరో వేషాలు వేస్తే ప్రజలు నిన్ను హీరోను చేయరు. కాబట్టి దమ్ముంటే ఒంటరిగా బరిలోకి దిగాలి' అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

ఆరోజు ఆయన ప్రాణాలు పోయేవి
చివర్లో రోజా 'నాయకుడికి ఓర్పు, బాధ్యత అవసరం. కానీ, పవన్‌కు అవి లేవు. ఆరోజు వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. అప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవి. ఓర్పు లేకుండా పిచ్చి వేషాలు వేసే వారికి ప్రజలు ఎప్పటికీ ఓటు వేయరు. ఎవరైతే ప్రజా సంక్షేమం అందిస్తారో వారికే ఓటు వేస్తారు. మళ్లీ జగన్‌నే గెలిపిస్తారు' అని చెప్పారు.


Click it and Unblock the Notifications