మెగా ఫ్యామిలీపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను దారుణంగా!
మెగా ఫ్యామిలీపై సినీ నటి, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌పై ఆమె వాడివేడిగా సంధించిన విమర్శనాస్త్రాలు చర్చనీయాంశమయ్యాయి. తాజా ఓ మీడియా సమావేశంలో రోజా విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీకి రాజకీయ భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. రోజా విమర్శలు ఆమె మాటల్లోనే..

పవన్ కల్యాణ్‌కు మానవత్వం లేదు
పవన్ కల్యాణ్‌కు కనీస మానవత్వం లేని ఉండదు. ఒక ఎమోషన్స్ లేవు. వాళ్లు ఆర్టిస్టుగా అయినందుకు ఒక ఆర్టిస్టుగా సిగ్గుపడుతున్నాను. సాధారణంగా సినీ నటులంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు తమకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని తలంచారు. వారికి మంచి చేయాలని ముందుకొచ్చి సీఎం అయ్యారు అని రోజా అన్నారు.

ఆ ముగ్గురు చిన్న సాయం చేయరు..
ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. మెగా ఫ్యామిలీలో ఎందుకు కాలేదంటే.. ప్రజలకు ఏమీ చేయలేదు. మెగా ఫ్యామిలీలో ముగ్గురు కూడా సీఎం ఎందుకు కాలేకపోయారంటే.. వాళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు చిన్న సహాయం చేయలేదు అని రోజా అన్నారు.

సొంత జిల్లా ప్రజలే ఓడించారని
చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ముగ్గురు తమ సొంత జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే అన్నదమ్ముల ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారు. రాజకీయాల్లో ఈ ముగ్గురికి భవిష్యత్ లేదు. సరైన సమయంలో ప్రజల కోసం స్పందిస్తే.. ప్రజలు కూడా మద్దతు పలికుతారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు ఆయనకు మద్దతుగా పవన్ కల్యాణ్ నిలుస్తాడు. ప్యాకేజ్ కోసం చంద్రబాబుకు విధేయత ప్రదర్శిస్తాడు అని రోజా విమర్శించారు.

పవన్ కల్యాణ్‌కు సమాధి కడుతారు..
ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి మద్దతు ఉంది. ఆయనపై విమర్శలు చేయడం ఆపాలి. ఏపీ సీఎం ఇచ్చిన హామీలు ఏం చేయలేదో చెప్పలేకపోతున్నారు. ఇప్పటంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడలు కడితే.. రౌడీలాగా కారుపై కూర్చొని వెళ్లి హంగామా చేశాడు. కందుకూరులో చంద్రబాబు పర్యటనలో చనిపోతే మాట్లాడలేదు. వారిని పట్టించుకోలేదు. పైగా వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్‌కు ప్రజలు సమాధి కట్టడం ఖాయం అని రోజా జోస్యం చెప్పారు.

రోజాపై మెగా ఫ్యాన్స్ ఫైర్
సినీ నటి మంత్రి రోజా వ్యాఖ్యలపై మెగా అభిమానులు, సినీ వర్గాలు, జనసేన కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ, చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ప్రతిష్టను కించపరిచే విధంగా చేసిన రోజాపై మెగా అభిమానులు భగ్గుమంటున్నారు. రోజా వ్యాఖ్యలపై చిరంజీవి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











