For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో తరుణ్‌కు పోలీసులు షాక్: ఫ్యామిలీని మొత్తాన్ని చుట్టుముట్టి.. సీక్రెట్ లీక్ చేసిన అలనాటి నటి

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించిన హీరోల్లో తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. మధ్యలో కొన్ని వివాదాలు, పరాజయాలతో సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఇందులో పోలీస్ కేసు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

  బాల నటుడిగా మొదలైన ప్రయాణం

  బాల నటుడిగా మొదలైన ప్రయాణం

  అప్పటి నటీనటులు రోజా రమణి, చక్రపాణి దంపతుల కుమారుడే తరుణ్. వాళ్లిద్దరి బ్యాగ్రౌండ్‌తో చిన్న వయసులోనే ‘మనసు మమత' అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి నంది అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అన్నింట్లోనూ తనదైన శైలి యాక్టింగ్‌తో అలరించి.. ప్రశంసలు దక్కించుకున్నాడు.

  హీరోగా మారాడు.. రికార్డులు కొట్టాడు

  హీరోగా మారాడు.. రికార్డులు కొట్టాడు

  బాల నటుడిగా సత్తా చాటిన తరుణ్.. ‘నువ్వే కావాలి' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ 365 రోజులు ఆడి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ‘నువ్వు లేక నేను లేను', ‘ప్రియమైన నీకు', ‘నువ్వే నువ్వే' వంటి ఎన్నో హిట్ చిత్రాలు చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో దేశ వ్యాప్తంగా పేరొందాడు.

  లవర్ బాయ్ ఇమేజ్.. క్రష్‌ అయ్యాడు

  లవర్ బాయ్ ఇమేజ్.. క్రష్‌ అయ్యాడు

  చిన్న వయసులోనే హీరోగా పరిచయమైన తరుణ్.. చాలా తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. అప్పట్లో చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. వరుసగా లవ్ స్టోరీతో సినిమాలు చేయడంతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా ఇదే అతడికి మైనస్ కూడా అయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  వివాదాలు, గొడవలు.. ముగిసిన కెరీర్

  వివాదాలు, గొడవలు.. ముగిసిన కెరీర్

  సుదీర్ఘమైన కెరీర్‌లో తరుణ్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో.. అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అప్పట్లో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ అని వార్తల్లోకి ఎక్కిన అతడు.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. దీంతో అతడికి చెడ్డపేరు దక్కింది. దీనికితోడు వరుస పరాజయాల కారణంగా కెరీర్‌ ముగిసింది. ఇక, ఇటీవలే ‘అనుకోని అతిథి'లో హీరోకు డబ్బింగ్ చెప్పాడు తరుణ్.

   హీరో తరుణ్‌కు షాకిచ్చిన పోలీసులు

  హీరో తరుణ్‌కు షాకిచ్చిన పోలీసులు

  ప్రముఖ ఛానెల్‌లో కమెడియన్ అలీ నిర్వహించే ‘అలీతో సరదాగా' అనే టాక్ షోకు హీరో తరుణ్ తల్లిదండులైన రోజా రమణి, చక్రపాణి దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబం గురించి, సినీ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అదే సమయంలో స్విడ్జర్లాండ్‌లో పోలీసులు షాకివ్వడంతో హీరో తరుణ్‌కు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి కూడా వెల్లడించారు.

  Raj Tarun New Movie Will Be Directed By Santo
  అప్పటి సీక్రెట్ లీక్ చేసిన రోజా రమణి

  అప్పటి సీక్రెట్ లీక్ చేసిన రోజా రమణి

  ఆ ఘటన గురించి రోజా రమణి మాట్లాడుతూ.. ‘తరుణ్‌కు పూజాలంటే చాలా ఇష్టం. దీంతో మేము షూటింగ్‌కు ఎక్కడికి వెళ్లినా అగర్‌బత్తిలు, కర్పూరం తీసుకుని వెళ్తాం. అలా స్విడ్జర్లాండ్‌లోని హోటల్‌లో తరుణ్ అవి వెలిగించి పూజలు చేస్తుండగా.. పొగలు వచ్చి ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే నలుగురు పోలీసులు మమ్మల్ని అందరినీ చుట్టుముట్టారు' అంటూ వివరించారు.

  English summary
  Tollywood Hero Tarun Mother and Father Rojaramani and Chakrapani Participated in Alitho Saradaga Show. In This Show.. She Sared Unexpected Issues. This Promo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X