తరుణ్‌కు మూడు సార్లు పెళ్లైంది.. ఆ హీరోయిన్లు కంప్లైంట్ చేశారు: తొలిసారి బయటపెట్టిన హీరో తల్లి
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో ఒకప్పటి హీరో తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలెట్టిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుకున్నాడు. స్టార్‌గా ఎదుగుతాడని అనుకుంటోన్న సమయంలో అనుకోకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి అతడి పర్సనల్ లైఫ్‌పై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్ తల్లి రోజారమణి అతడి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీరే చూడండి!
చిన్నప్పుడే సెన్సేషన్‌గా
సినీ జంట రోజా రమణి, చక్రపాణి దంపతుల కుమారుడే తరుణ్. వాళ్లిద్దరి బ్యాగ్రౌండ్‌తో అతి చిన్న ఏజ్‌లోనే 'మనసు మమత' అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి నంది అవార్డును తీసుకున్నాడు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి అలరించాడు. అన్నింట్లోనూ తనదైన శైలి యాక్టింగ్‌తో అలరించి.. ప్రశంసలు అందుకున్నాడు.

హీరోగా మారి రికార్డులు
తరుణ్ 'నువ్వే కావాలి' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ 365 రోజులు ఆడి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. దీని తర్వాత 'నువ్వు లేక నేను లేను', 'ప్రియమైన నీకు', 'నువ్వే నువ్వే' వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో తరుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
వివాదాలు, గొడవలతో
సుదీర్ఘమైన కెరీర్‌లో తరుణ్ ఎంతటి పేరు దక్కించుకున్నాడో.. అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అప్పట్లో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ అని వార్తల్లోకి ఎక్కిన అతడు.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో హైలైట్ అయ్యాడు. దీంతో అతడికి చెడ్డపేరు దక్కింది. దీనికితోడు వరుస పరాజయాల కారణంగా కెరీర్ ముగిసింది. ఇక, ఈ మధ్యనే 'అనుకోని అతిథి'లో హీరోకు డబ్బింగ్ చెప్పాడు.

తరుణ్ పెళ్లిపై టాక్స్
హీరో తరుణ్ సినిమాలకు దూరమై చాలా కాలమే అవుతోంది. సెలెబ్రిటీ క్రికెట్‌లో అప్పుడప్పుడు మాత్రమే మెరుస్తున్నా అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కొంత కాలంగా ఈ లవర్ బాయ్ పెళ్లి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులోనూ అతడు ఫలానా హీరోయిన్‌లో పెళ్లాడాడంటూ టాక్ వచ్చాయి. ఇలా తరుణ్ పెళ్లి తరచూ హాట్ టాపిక్ అవుతోంది.
పేరులోనే ఉంది కదా
తరుణ్ తల్లి రోజా రమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడి పెళ్లి రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు. 'రూమార్స్ అంటేనే నిజం కాదని అర్థం కదా. అందుకే అలాంటి వార్తలను అస్సలు నమ్మొద్దు. అలాంటివి చూసినప్పుడు నవ్వుకుని వదిలేస్తే చాలా బెటర్. అలా తరుణ్ పెళ్లి గురించి ఎన్ని ప్రచారాలు జరిగినా జరిగే నష్టం ఏమీ లేదు' అని చెప్పుకొచ్చారు.

మూడుసార్లు పెళ్లైంది
రోజా రమణి కంటిన్యూ చేస్తూ.. 'తరుణ్ సినిమాల్లో చేసుకున్న పెళ్లిళ్ల కంటే బయటే ఎక్కువగా జరిగాయి. అలా ఇప్పటికే వాడికి మూడుసార్లు పెళ్లి అయింది. మార్ఫింగ్ ఫొటోలతో తరుణ్‌కు పెళ్లి చేయడం మీరు చూసే ఉంటారు. ఎవరెవరివే ముఖాలను మార్చేసి వాడి పెళ్లి జరిగిందని ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు. ఇలా కావాలనే కొందరు వాడికి చాలా పెళ్లిళ్లు చేశారు' అని అన్నారు.
హీరోయిన్లు కంప్లైంట్
రోజా రమణి కొనసాగిస్తూ.. 'ముఖ్యంగా కొందరు హీరోయిన్లతో పెళ్లి రూమర్స్ వచ్చినప్పుడు వాళ్లు నాకు కాల్ చేసి ఆంటీ ఫొటో చూశారా అని అడుగుతుంటారు. అలాగే, శ్రీయ, త్రిష, ప్రియమణి అప్పుడప్పుడూ ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తుంటారు. అందుకే వాటిని నేను సీరియస్‌గా తీసుకోను. తరుణ్ పెళ్లి నా బాధ్యత. వాడు ఎప్పుడంటే అప్పుడు చేసేస్తాం' అంటూ వివరించారు.


Click it and Unblock the Notifications











