'రచ్చ'లో తమన్నా పాత్ర
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో తమన్నా ఓ కోటీశ్వరుడు కూతురుగా కనిపించనుంది. రెగ్యులర్ స్కీమ్ లోనే రామ్ చరణ్ ఓ పేదింటి కుర్రాడుగా..ఆమెను ట్రై చేసి ఎదగాలనుకునే వ్యక్తిగా కనపిస్తాడు. ఫస్టాఫ్ అంతా అస్సలు ఆమే ఆ కోటీశ్వరుడు కూతురు అని తెలియక కామిడీగా డ్రామా నడుస్తుందని తెలుస్తోంది. సెకండాఫ్ అంతా కథ సీరియస్ గా ఓ ఛాలెంజ్ తో నడుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. రంగంలో విలన్ గా చేసిన అతనే ఇందులోనూ విలన్ గా చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పాత్ర మొత్తం మాస్ మాస్ గా ఉంటుందని చెప్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని ఓ మాస్ మశాలా చిత్రంగా మలిచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











