'గోలీమార్' లో సర్పైజ్ చేస్తాను...ప్రియమణి
నేను ష్యూర్ గా చెప్తున్నాను...నా రాబోయే చిత్రం 'గోలీమార్' లో నా పాత్ర చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈ అమ్మాయేనే పరుత్తివీరన్ లో విలేజ్ అమ్మాయిగా చేసింది అని మాట్లాడుకుంటేనే నేను హ్యాపీ ఫీలవుతాను. ఇక గోలీమార్ లో నాది క్యూట్ రోల్..అలాగే ఫెరపార్మెన్స్, గ్లామర్ కలగపిన పాత్ర అని చెప్తూ మురిసిపోతోంది. ఇక ప్రియాంక చోప్రా..ఫ్యాషన్ లో గ్లామర్ రోల్ చేసి నేషనల్ అవార్డు పొందింది. నాకు తెలిసి మన సౌత్ లో అలాంటి అవకాశం రావటం మాత్రం అరుదు అంది. ప్రస్తుతం గోలీమార్ లో పాట కోసం హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇలా మనస్సు విప్పింది. మణిరత్నం రావణ్ లోనూ, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలోనూ ఆమె గొప్ప పాత్రలు చేస్తున్నట్లు చెప్పింది. ఇక గోపీచంద్ హీరోగా చేస్తున్న గోలీమార్..ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.
ప్రియమణి గోలీమార్ పూరీ జగన్నాధ్ గోపీచంద్ శంఖం శంభో శివ శంభో రావణ్ priyamani gopichand puri jagannath golimaar ravan raktha charitra


Click it and Unblock the Notifications