తెలుగుభామ ‘రొమాన్స్’ అందిరింది(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : కొంత కాలంగా ఇతర రాష్ట్రాల భామలు తెలుగు ఇండస్ట్రీలో దూసుకుతోతున్నారు. వారితో పోటీ పడుతూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు రేష్మ, నందిత, శ్రీదివ్య లాంటి తెలుగు హీరోయిన్లు. వీరితో పాటు మరో హీరోయిన్ తన అందచందాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరో కాదు....'రొమాన్స్' మూవీ హీరోయిన్ మానస.

ఈ రోజుల్లో, బస్టాప్, ప్రేమ కథా చిత్రం లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ దర్శకుడిగా ఎదిగిన మారుతి సమర్పణలో 'రొమాన్స్' మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జి.శ్రీనివాసరావు, ఎస్.కె.ఎన్ నిర్మాతలు. 'బస్టాప్' ఫేం ప్రిన్స్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో డింపుల్, మానస హీరోయిన్లు.

సాయి కార్తీక్ అందించిన ఆడియోని ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసారు. ఇప్పటికే ఈ ఆడియో సూపర్ డూపర్ హిట్ కాగా చిత్రాన్ని ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నానరు.

మానస హాట్ ఫోటోలు, సినిమా వివరాలు స్లైడ్ షోలో...

నిర్మాతలు మాట్లాడుతూ...

నిర్మాతలు మాట్లాడుతూ...


నిర్మాతలు మాట్లాడుతూ ‘మా నిర్మాణ సంస్థ గుడ్ సినిమాస్ గ్రూప్ బ్యానర్ మరియు మారుతి మీడియా హౌస్‌పై మా మొదటి చిత్రం ‘ఈ రోజుల్లో' ఎంతటి ఘన విజయం సాధించిందో అంతుకు మించి కొన్ని వందల మంది కొత్త వాళ్లకి ఆదర్శంగా నిలవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇదే బ్యానర్‌లో మా ద్వితీయ ప్రయత్నంగా వస్తున్న ‘రొమాన్స్' చిత్రం కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది.

కమర్షియల్ హంగులతో...

కమర్షియల్ హంగులతో...


అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సాయి కార్తీక్ అందించిన ఆడియో మా అభిమాన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదలై సూపర్ హిట్టయింది. బాబా సెహగల్, బేబీ తిల్లు పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు తెలిపారు.

చిత్రీకరణలో కాంప్రమైజ్ కాలేదు

చిత్రీకరణలో కాంప్రమైజ్ కాలేదు


ఆడియో మాత్రమే కాకుండా చిత్రంలో సాంగ్స్ పిక్చరైజేషన్‌ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించడం జరిగింది. మా సినిమాటోగ్రాఫర్ జె.ప్రభాకర్ రెడ్డి ప్రతి ఫేం అందంగా చూపించారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్‌కి మంచి ప్రశంసలు అందాయి అని నిర్మాతలు తెలిపారు.

ఆగస్టు మొదటి వారంలో విడుదల

ఆగస్టు మొదటి వారంలో విడుదల


డార్లింగ్ స్వామి బేసిగ్గా రైటర్ కావడంతో డైలాగులు అదిరిపోయే డైలాగులతో పాటు, తనలోని దర్శకత్వ కోణాన్ని ఎంతో బాగా చూపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు మొదటి వారంలో సినిమాను విడుదల చేయబోతున్నాం. సినిమా యూత్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటుందిన నిర్మాతలు తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు


ప్రిన్స్, డింపుల్, మానస, ప్రభాకర్, నల్లవేణు, సాయి, భార్గవి, వెంకి, విష్ణు, ప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు నటిస్తున్నారు. లిరిక్స్ : శ్యాం, కరుణకరణ్, డాన్స్ : స్వర్ణ, సతీష్, ఆర్ట్ : గోవింద్, ఎడిటింగ్ : ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ : జెప్రభాకర్ రెడ్డి, సంగీతం : సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సురేష్ కుమార్, నిర్మాతలు : జి.శ్రీనివాసరావు, ఎస్.కె.ఎన్, సమర్పణ : మారుతి, కథ-మాటలు-దర్శకత్వం : డార్లింగ్ స్వామి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X