అన్నీ బూతులే: సంచలనం రేపుతున్న ‘రొమాంటిక్ క్రిమినల్స్’

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి.సునిల్ కుమార్ రెడ్డి త్వరలో మరో సంచలన మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రొమాంటిక్ క్రిమినల్స్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్లు ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నాయి.

కాలేజీ కుర్రకారు చాటు మాటుగా చేసే రొమాన్స్, శృంగార కార్యకలాపాలను పచ్చిగా ఈ చిత్రంలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చెడుదారి పట్టిన యువత ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు, వారు క్రిమినల్ చర్యలకు పాల్పడటానికి కారణం ఏమిటనే విషయాలను చర్చిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.

టీజర్లో అన్నీ బూతులే

టీజర్లో అన్నీ బూతులే

ఈ సినిమాపై యువతలో క్రేజ్ పెంచడమే లక్ష్యంగా ఇటీవల విడుదలైన టీజర్లో అన్నీ బూతులే చూపించారు. ముద్దు సన్నీవేశాలు, రొమాంటిక్ సీన్ల డోస్ సినిమాలో ఏ రేంజిలో ఉంటుందో హిట్ ఇవ్వడం ద్వారా హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

నన్ను నీ పక్కలో పడుకోమన్నావని...

నన్ను నీ పక్కలో పడుకోమన్నావని...

కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్‌లో తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ప్రిన్సిపాల్‌‌కు దొరికిపోయిన అమ్మాయి.... మీపై యాక్షన్ తీసుకుంటానని చెప్పిన ప్రిన్సిపాల్‍‌ను బెదిరించిన సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. ‘‘నన్ను నీ పక్కలో పడుకోమన్నావని, రెండేళ్లుగా వాడుకుదొబ్బుతున్నావని ఏడుస్తూ టీవీ చానల్స్‌లో లైవ్‌లో కూర్చుంటా. నాకు రెండు సార్లు అబార్షన్ చేయించావని నీ ఇంటి ముందు టెంట్ వేయించి మరీ పరువు తీస్తా.'' అనే డైలాగ్స్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతో స్పష్టం చేస్తోంది.

నేనొక పనికిమాలినదాన్ని..

నేనొక పనికిమాలినదాన్ని..

‘‘ఎక్కువ మాట్లాడితే కులం పేరు, మతం పేరు కూడా తీసుకొస్తా ప్రిన్సిపల్ సర్... నేనొక పనికిమాలినదాన్ని, నా గురించి మీ లైఫ్ ఎందుకు పాడుచేసుకుంటారు చెప్పండి. మీరు రాముడైనా సరే... శూర్పణక ఏడుస్తూ ప్రెస్ మీట్ పెడితే రావణాసుడివి అయిపోతావు ఈ మెరుగైన సమాజంలో..'' అంటూ వచ్చే డైలాగులు సినిమా కథ ఎలాంటి అంశాల నేపథ్యంలో ఉంటుందో స్పష్టం చేస్తోంది.

వ్య‌స‌నాలు ఏమైనా వాటి ప‌ర్య‌వ‌ససానాలు వినాశ‌కర‌ంగా ఉంటాయ‌నే పాయింటుతో

వ్య‌స‌నాలు ఏమైనా వాటి ప‌ర్య‌వ‌ససానాలు వినాశ‌కర‌ంగా ఉంటాయ‌నే పాయింటుతో

ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన బి.బాపిరాజు మాట్లాడుతూ.. ''ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల ర‌హ‌స్యాన్ని ఆద్యంతం ఆశ‌క్తిక‌రంగా తెరకెక్కించాం. ఈ చిత్రం గ‌త రెండు చిత్రాల‌కంటే ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంది. యువ‌తని ప‌ట్టిపీడించే వ్య‌స‌నాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజి స్టూడెంట్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో హీరోగా మ‌నోజ్ నంద‌న్‌, విల‌న్‌గా వినోద్, హీరోయిన్లుగా అవంతిక‌, దివ్య‌, మౌనిక నటించారు. వ్య‌స‌నాలు ఏమైనా వాటి ప‌ర్య‌వ‌ససానాలు వినాశ‌కర‌ంగా ఉంటాయ‌నే పాయింటును వినోదాత్మకంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెర‌కెక్కించారు.'' అన్నారు.

వినోదం‌తో పాటు చ‌క్క‌టి సందేశం

వినోదం‌తో పాటు చ‌క్క‌టి సందేశం

ద‌ర్శ‌కుడు పి.సునిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ముందు చేసిన రెండు చిత్రాలను మించి వినోదం‌తో పాటు చ‌క్క‌టి సందేశం వుంటుంది. ఈ చిత్రానికి ఎస్‌.వి. శివ‌రామ్ సినిమాటోగ్ర‌ఫి హైలెట్ అవుతుంది. సుధాక‌ర్ మారియో సంగీతం సార‌థ్యంలో నాలుగు పాట‌లు చాలా చక్క‌గా కుదిరాయి.'' అని తెలిపారు.

రొమాంటిక్ క్రిమినల్స్

రొమాంటిక్ క్రిమినల్స్

ఈ చిత్రంలో మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక , ఎఫ్‌.ఎమ్ బాబాయ్, బుగ‌తా, స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌ తదితరులు. ఈచిత్రానికి పాటలు: బాల వ‌ర్ద‌న్‌, సంగీతం: సుధాక‌ర్ మారోయో, కెమెరా: ఎస్‌.వి. శివ‌రామ్‌, ఎడిటింగ్‌: శామ్యుల్ క‌ళ్యాణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X