సుడిగాలి సుధీర్‌కు అంత సీనుందా? రష్మితో అలాంటి సినిమానా?
యాంకర్ రష్మితో సుడిగాలి సుధీర్ న్యూ మూవీ రాబోతున్నట్లు గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. వీరి కలయికలో ఎలాంటి షో వచ్చినా బుల్లితెరపై రేటింగ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఇక సినిమా వస్తే ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అంతలా వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. ఇద్దరు ఆఫ్ స్క్రీన్ లవర్స్ అనేలా ఓ స్పెషల్ క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. అది ఎంతవరకు నిజం అనే విషయంలో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఇక ఫైనల్ గా వీరి కలయికలో ఒక సినిమా కూడా రాబోతోంది.

ఆ షో ద్వారా మరింత క్రేజ్..
జబర్దస్త్ ద్వారా మొదలైన రష్మీ, సుధీర్ ప్రయాణం డీ జోడితో మరో లెవెల్ కి వెళ్లింది. సుధీర్ చేష్టలు, రష్మీ కొంటేతనంతో వీరి మధ్య ఎదో నడుస్తోందని ఒక టాక్ మొదలైంది. ఆ మధ్య ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే టాక్ ఎంతగానో వైరల్ అయ్యింది. ఇక రష్మీ కేవలం షోల కోసమే అలా చేస్తామని చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చింది.

ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా..
రష్మీ గౌతమ్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా అదే తరహాలో రూమర్స్ వస్తుండడంతో ఆమె ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేసింది. ఇకపోతే ఇప్పుడు వీరు బిగ్ స్క్రీన్ పై మెరవనున్నట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాత శేకర్ రాజు సుధీర్ తో ఇదివరకే సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేశారు. అందులో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఒక రొమాంటిక్ సినిమా..
అసలైతే అదే సినిమాలో రష్మీ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవకాని అనుకున్నారు. కానీ అప్పుడు కాస్త బిజీగా ఉండడంతో రష్మీ డేట్స్ ఇవ్వలేకపోయిందట. ఇక ఇప్పుడు డేట్స్ దొరకడంతో శేఖర్ రాజు వీరి కలయికలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.
Recommended Video

బాక్సాఫీస్ మార్కెట్ ఉందట..
బుల్లితెరపై క్లిక్కయిన యాక్టర్స్ బిగ్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ అవ్వరనే టాక్ ఉంది. అయితే సుధీర్ తో చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కోట్లల్లో లాభాలను అందించిందని, అలాగే సుధీర్ కి మంచి మార్కెట్ ఉందని చిత్ర యూనిట్ ఆ మధ్య ప్రమోషన్స్ బాగా చేసింది. ఇక ఇప్పుడు రష్మీ, సుధీర్ అంటే ఆ కాంబినేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. మరి ఈ జంట తెరపైకి ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











