ప్రేమికులు మెచ్చేలా పూరి ‘రోమియో’ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: సాయి రామ్ శంకర్, అడొనిక హీరో హీరోయిన్లు టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో పూరి శిష్యుడు గోపీ గణేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దొరైస్వామి నిర్మిస్తున్న చిత్రం 'రోమియో'. 'పూరి రాసిన ప్రేమ కథ' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి కథ, డైలాగులు పూరి జగన్నాధ్ అందించారు. రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పూరి చేతుల మీదుగా ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

అనంతరం పూరి మాట్లాడుతూ - ''ఈ కథ ఎప్పుడో రాసాను. నేను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది. నేను యూరోప్ కి వెళ్లినప్పుడు అక్కడ రోమియో, జూలియట్ తిరిగిన ఓ విలేజ్ కి వెళ్లాను. అక్కడే ఈ కథకు లైన్ దొరికింది. నా దగ్గర చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన గణేష్ కి నేను ఇచ్చిన బహుమతి ఈ రోమియో కథ. మంచి విజయం సాధించాలని, అందరికీ పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..


దర్శకుడు గణేష్ మాట్లాడుతూ '' పూరి జగన్నాధ్ గారికి జీవితాంతం బుణపడి ఉంటాను. నాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సాయిరామ్ శంకర్, నేను కలిసి అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసాము. బాగా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రం చేసాము. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు'' అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..


''పూరి జగన్నాధ్ గారి స్టోరీతో నా తొలి చిత్రం రూపొందడం ఆనందంగా ఉంది. అద్భుతమైన కథ, డైలాగులు ఇచ్చారు పూరి. ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..


''అన్నయ్య చాలా బిజీగా ఉన్న సమయంలో ఈ కథ తయారు చేసాడు. డైరెక్టర్ గోపీ గణేష్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

నటనటులు, టెక్నీషియన్స్

నటనటులు, టెక్నీషియన్స్


సాయిరామ్ శంకర్, అడొనిక, రవితేజ (ప్రత్యేక పాత్రలో), నాగబాబు, అలీ, సుబ్బరాజు, జయసుధ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్ - పూరి జగన్నాధ్, మ్యూజిక్ డైరెక్టర్ - సునిల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - పి.జి.విందా, ఎడిటర్ - నవీన్ మాలి, పి.ఆర్.ఓ - శ్రీనివాస్ గండ్ల, ప్రమోషన్స్ హెడ్ - సుమంత్ మోత, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - గోపి గణేష్, సమర్పణ - మధుర శ్రీధర్ రెడ్డి, ప్రొడ్యూసర్ - టచ్ స్టోన్ దొరైస్వామి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X