బిజినెస్ కోసమే రవితేజ ఎత్తుకెళ్తానంటున్నాడు
హైదరాబాద్ : రవితేజ త్వరలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి మురిపించనున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న 'రోమియో'లో రవితేజ కనిపిస్తాడు. సినిమాలో రవితేజ అలా వచ్చి వెళ్లిపోవటం కాదని, ఓ సర్పైజ్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు రవితేజ డైలాగుతో కూడిన ఓ టీజర్ విడుదల చేసారు.
అందులో రవితేజ... వాడు ఎదవ కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నాడు...అదే నేనైతేనే ఈ పాటికి ఎత్తుకుపోయేవాడ్ని అంటూ హీరోయిన్ తో చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ కోసం అని ట్రేడ్ లో వినపడుతోంది. చిత్రం పూర్తై చాలా కాలం అయినా బిజినెస్ లేక మూలన పడిందని, ఇప్పుడు ఈ టీజర్ తో రవితేజను అడ్డం పెట్టి థియోటర్స్ కు పంపలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.
ఇక సినిమాలో కథను మలుపు తిప్పేదిగా ఈ గెస్ట్ పాత్ర ఉంటుందని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ స్క్రిప్టు వర్క్ చేసిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు గోపీ గణేష్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'పూరి రాసిన ప్రేమకథ' అనేది ఉపశీర్షిక. అడోనిక ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఆమె అందాలు సినిమాకు ప్లస్ అవుతాయంటున్నారు.
బలుపు హిట్ తో మంచి ఊపు మీద ఉన్న రవితేజ త్వరలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి మురిపించనున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న 'రోమియో'లో రవితేజ కనిపిస్తాడు. సాయి రామ్ శంకర్ సరసన అడోనికా నటిస్తుంది. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గోపి గణేష్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. తన శిష్యుడు దర్శకుడిగా మారటం, తన తమ్ముడే హీరో కావడంతో ఈ సినిమాకి స్టొరీ, డైలాగ్స్ పూరి స్వయంగా రాసాడు.

పూరి మీద ఉన్న అభిమానంతో రవితేజ ఈ సినిమా అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. 5 నిమిషాల నిడివి గల పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. పి.జి వినడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. సినిమాలో రవితేజ అలా వచ్చి వెళ్లిపోవటం కాదని, ఓ సర్పైజ్ గా ఉంటుందని చెప్తున్నారు. సినిమాలో కథను మలుపు తిప్పేదిగా ఈ గెస్ట్ పాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి 'పూరి రాసిన ప్రేమకథ' అనేది ఉపశీర్షిక. అడోనిక (పరిచయం) హీరోయిన్ గా చేస్తోంది.
దర్శకుడు మాట్లాడుతూ ''చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో- జూలియెట్. వీరు యూరప్‌లో కలిసే ప్రదేశం 'వెరోనా'. ఈ ప్రాంతంలో జరిగే ప్రేమకథే 'రోమియో. కథ, మాటలు ఇచ్చారు కాబట్టి ఉపశీర్షిక పూరి పేరు మీదే నిర్ణయించాం''అన్నారు. తనకూ పూరీ జగన్నాధ్ కి ఉన్న స్నేహంతో ఈ గెస్ట్ పాత్రను ఒప్పుకున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











