వైభవంగా దర్శకురాలి వివాహం (ఫోటోలు)
బెంగుళూరు: స్టేట్ అవార్డ్ విన్నింగ్ కన్నడ దర్శకురాలు రూప అయ్యర్ వివాహం గౌతమ్ శ్రీవాత్సవ్ తో బుధవారం బెంగుళూరులో గ్రాండ్ గా జరిగింది. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. వీరి వివాహాం ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో జరిగింది. జూన్ 19న వీరి ఎంగేజ్మెంట్ సెర్మనీ గ్రాండ్ గా జరుగగా....ఈ రోజు వివాహం చేసుకున్నారు. 'ముఖ పుట' అనే కన్నడ చిత్రానికి గాను రూప అయ్యర్ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గెలుచుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. రూప, గౌతం గతంలో 'చంద్ర' అనే సినిమాకు కలిసి పని చేసారు.
రూప అయ్యర్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. ఆమె దర్శకురాలు మాత్రమే కాదు డాన్సర్, ఫిలాసఫర్, కాలమిస్ట్, నటిగా కూడా తనను తాను నిరూపించుకున్నారు. దాదాపు డజను చిత్రాల్లో ఆమె నిటిస్తూ దర్శకత్వం వహించారు. వివిధ దేశాలు తిరుగుతూ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. స్లైడ్ షోలో రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవకు వివాహానికి సంబంధించిన ఫోటోలు...

వివాహ మహోత్సవం
రూప అయ్యర్, గౌతమ్ శ్రీవాత్సవ వివాహం.

మంగళ సూత్రం
వధువు మెడలో మంగళసూత్ర కడుతున్న వరుడు.

ఎంతో ప్రత్యేకం
పెళ్లి సమయంలో తాళి కట్టే గట్టాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.

రూప, గౌతమ్
వివాహ వేడుకలో రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ

నుదుట తిలకం దిద్దుతూ..
వధువు రూప అయ్యర్ నుదుట తికలం దిద్దుతున్న వరుడు గౌతం శ్రీవాత్సవ.

సంప్రదాయ బద్దంగా...
రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ వివాహం సంప్రదాయ బద్దంగా జరిగింది.

కుటుంబ సభ్యులు
రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ వివాహంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు.

సెల్రబిటీలు
రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ వివాహ మహోత్సవానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

వివాహం అనంతరం
వివాహం అనంతరం గౌతం శ్రీవాత్సవ, రూప అయ్యర్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రూప అయ్యర్ డాన్స్
రూప అయ్యర్ ప్రముఖ డాన్స్ కళాకారిణి. ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇలా..

సంగీత్
వివాహ మహోత్సవం సందర్భంగా జరిగే సంగీత్ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ...

మీడియాతో...
మెహందీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రూప అయ్యర్.

రిసెప్షన్ ఇన్విటేషన్
రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ రిసెప్షన్ ఆగస్టు 10న జరుగనుంది.


Click it and Unblock the Notifications