హాట్ దర్శకురాలి వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోస్)
బెంగుళూరు: స్టేట్ అవార్డ్ విన్నింగ్ కన్నడ దర్శకురాలు రూప అయ్యర్ వివాహం గౌతమ్ శ్రీవాత్సవ్ తో ఇటీవల(ఆగస్టు 7) బెంగుళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు 10)న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. వీరి వివాహాం ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో జరిగింది.
జూన్ 19న వీరి ఎంగేజ్మెంట్ సెర్మనీ గ్రాండ్ గా జరుగగా....ఆగస్టు 7న వివాహం చేసుకున్నారు. 'ముఖ పుట' అనే కన్నడ చిత్రానికి గాను రూప అయ్యర్ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గెలుచుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. రూప, గౌతం గతంలో 'చంద్ర' అనే సినిమాకు కలిసి పని చేసారు.
రూప అయ్యర్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. ఆమె దర్శకురాలు మాత్రమే కాదు డాన్సర్, ఫిలాసఫర్, కాలమిస్ట్, నటిగా కూడా తనను తాను నిరూపించుకున్నారు. దాదాపు డజను చిత్రాల్లో ఆమె నిటిస్తూ దర్శకత్వం వహించారు. వివిధ దేశాలు తిరుగుతూ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. స్లైడ్ షోలో రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు స్లైడ్ షోలో....

క్రేజీ స్టార్ రవిచంద్రన్
కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

సుమలత
రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన నటి సుమలత.

యోగరాజ్ భట్
కన్నడ డైరెక్టర్ యోగరాజ్ భట్ కూడా రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాఘవేంద్ర రాజ్ కుమార్
నటుడు, నిర్మాత రాఘవేంద్రరాజ్ కుమార్ కూడా రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

విశ్వేశ్వర్ భట్
కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్ ఎడిటర్ విశ్వేశ్వర్ భట్ కూడా రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాజేంద్రసింగ్ బాబు
డైరెక్టర్ రాజేంద్రసింగ్ బాబు కూడా రూప అయ్యర్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

శ్రీనాథ్
నటుడు శ్రీనాత్ నత కూతురుతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

రూప, గౌతమ్
వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా రూప అయ్యర్, గౌతం శ్రీవాత్సవ్ రొమాంటిక్ లుక్


Click it and Unblock the Notifications