For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రేజ్ కోసం దిగజారి విప్పతీసింది..వివాదం(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  బెంగుళూరు : సినిమా ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు దర్శక,నిర్మాతలు. అయితే సెన్సార్ వద్ద దొరికిపోతామని తెలిసినా రిలీజ్ ముందు దాకా నానా హంగామా చేస్తూంటారు. ఆ క్రమంలో క్లాసిక్స్ కు కూడా బ్రష్టు పట్టిస్తూంటారు. తాజాగా కన్నడ పరిశ్రమలో వారికి అలాంటి అనుభవమే ఎదురవుతోంది.

  అప్పట్లో టి.ఎస్ నాగాభరణ డైరక్ట్ చేసిన మైసూర్ మిల్లగీ చిత్రం తెలియని వారు ఉండరు. సాహిత్యం నుంచి తెరపైకి ఎక్కిన బెస్ట్ ఎడాప్షన్ గా ఆ చిత్రాన్ని చెప్తూంటారు. స్వాతంత్ర్యం రాకముందు గ్రామీణ జీవితాన్ని వర్ణిస్తూ ఉన్న పధ్యాలను ఆధారం చేసుకుని సినిమా చేసారు. ఎన్నో అవార్డులను ఆ చిత్రం పొందింది.

  అయితే ఇప్పుడు అదే టైటిల్ తో రూపొందుతున్న చిత్రం ప్రారంభం కాకుండానే సంచలనం క్రియేట్ చేస్తోంది. మొత్తం కనపడేలా బేర్ బాడీతో హీరోయిన్ తో ఫోటో షూట్ చేసి వదిలారు. ఇప్పుడా ఫోటోలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫొటో షూట్ లో పాల్గొన్న రూపా నటరాజ్ ఇప్పుడు అందరికీ చర్చనీయాంసంగా మారింది.

  ఆ ఫోటో షూట్ పోటోలు మీ కోసం స్లైడ్ షో లో...

  దాదాపు అన్ని వదిలి రూపా నటరాజు ఈ ఫోటో షూట్ చేసిందని చూసిన వారంతా అంటున్నారు. ఆమె నాటీ ఎక్సప్రెషన్స్, అవుట్ ఫిట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఇప్పుడు బెంగుళూరులో ఇదో చర్చనీయాంసంగా మారింది. ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందని భావిస్తున్నారు.

  ఇలా బ్యాక్ లెస్ ఆమె ఇచ్చిన ఫోస్ ..దండుపాళ్యంలో పూజా గాంధీని గుర్తు చేసింది. దండుపాళ్యం సినిమా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమాలో ఈ తరహా స్టిల్ నే పోస్టర్స్ వాడి ఓపినింగ్స్ రాబట్టారు. పూజాగాంధికు కూడా ఈ సినిమా చాలా పేరు తెచ్చిపెట్టింది. అదే తరహాలో రూపా నటరాజు కూడా ఆశిస్తోంది.

  ఈ పోటోలు చూసినవారంతా ...ఈ దర్శకుడు ఆ క్లాసిక్ చిత్రం మైసూర్ మిల్లగే ని నాశనం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆ చిత్రం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. దర్శకుడుకూ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.

  ఈ ఫొటో షూట్ విషయం తెలుసుకున్న మైసూరు మల్లిగ దర్శకుడు టి.ఎస్ నాగాభరణ చాలా బాధగా ఫీలయ్యారు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. అయితే టైటిల్ మార్చినా పెద్దగా ఫలితం లేదన్నారు. ఎందుకంటే అప్పటికే రావాల్సిన పేరు వచ్చేసింది. సినిమాకు బిజినెస్ ప్రారంభమైంది.

  ఈ కొత్త చిత్రం దర్శకుడు మాత్రం ఈ కథని మాత్రం ఊహించలేని విధంగా అల్లామని,ఎక్కువ ఊహించుకోవద్దని సూచన చేస్తున్నాడు. తన చిత్రం టైటిల్ వరకే కానీ ..పాత చిత్రానికి దీనికి అసలు పోలిక లేదంటున్నాడు. తమ సినిమాలో సహజ సిద్దమైన ఎమోషన్స్ ఉంటాయని, వాటిని మాత్రమే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నామని దర్శకుడు నమ్మబలుకుతున్నాడు.

  ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.... ఓ అమాయిక అమ్మాయి కథ అని... ఆమె ఎదిగే దశలో సమాజం నుంచి ఎదురైన కష్టాలను చూపిస్తున్నామని దర్శకుడు కథ గురించి చెప్తున్నారు. ఈ చిత్రం ఓ వర్గానికి చాలా ఊరట ఇస్తుందని, ఇలాంటి చాలా మందిని చూసే తను కథ తయారుచేసుకున్నానని చెప్పారు.

  తమ మైసూరు మల్లిగ చిత్రాన్ని వాస్తవానికి దగ్గరగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ,నిర్మాత చెప్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ..బడ్జెట్ తో సంభందం లేకుండా తమ చిత్రం రూపొందిస్తున్నామని, ఓ సంచలన చిత్రం గా నిలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే తమ దర్శకుడు చిత్రాన్ని చాలా అద్బుతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

  ఈ చిత్రంలో టీవీ ఆర్టిస్టులు చాలా మంది కనిపిస్తారని, ఖచ్చితంగా వారందరికీ ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని హామీ ఇస్తున్నారు నిర్మాత. అలాగే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రూపా నటరాజు కూడా అధ్బుతమైన ఫెరఫార్మెర్ అని,చిత్రం రిలీజయ్యారు ఆమె చాలా బిజీ ఆర్టిస్టు అవుతుందని చెప్పుకొచ్చారు.

  English summary
  TS Nagabharana's Mysore Mallige was a classic and remembered even today as one of the best screen adaptation from a literary work. The film was made in 1992 and now, a movie on the same name is being made which has created a controversy. Well, a young team is making a movie with the title Mysore Mallige. The shocking part of the film is - dare bare photos! The pictures of the female lead Roopa Nataraj have created a controversy and irked a section of Kannada film goers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X