పెద్ద, చిన్న తేడా లేదు.. సినిమాలో దమ్ముంటేనే ఆదరణ.. సీ కల్యాణ్

By Rajababu

శ్రీవారి క్రియేషన్స్ పతాకం పై మున్నా, ప్రియాంక ఆగస్టీన్ హీరో హీరోయిన్లు గా ఎస్. శ్రీనివాస్ మరియు ఎస్. సుధీర్ సంయుక్త నిర్మాణం లో శరగడం శ్రీనివాస్ దర్శకత్వం లో జి వి కె సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం రోషిని కేర్ అఫ్ తూర్పు గది (Roshini C/O Turpu Gadhi). ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్ గారు ఆడియో సీడీని విడుదల చేసి మొదటి సీడీని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాసుకు అందజేశారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో కథ బలం వున్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేదు, అందుకే మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పక విజయం సాధిస్తాయి. ఇండస్ట్రీలో ఎంప్లాయిమెంట్ ఎక్కువగా చిన్న సినిమాల వల్లనే జరుగుతుంది. వాటి సర్వైవల్ కోసం ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇస్తున్నది. దానివల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుంది. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళు సహకరించాలి" అని అన్నారు.

Roshini C/O Turpu Gadhi audio released

చాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు మాట్లాడుతూ "చిత్ర సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ చక్కటి సంగీతం అందించారు. ఖచ్చితంగా పాటలు అందరికి నచ్చుతాయి. చిన్న సినిమాలకి ఛాంబర్ సహాయం ఎప్పుడు ఉంటుంది" అని అన్నారు.

చిత్ర దర్శకుడు, నిర్మాతలలో ఒక్కరైనా శరగడం శ్రీనివాస్ మాట్లాడుతూ "ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకుని ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాను. చిత్ర నిర్మాణం లో ప్రతీ టెక్నీషియన్ హీరో హీరోయిన్ మాకు బాగా సహకరించారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మోహన్ గౌడ్ తన భుజాలమీద వేసుకుని జరిపించారు. అందరికి నా ధన్యవాదాలు" అని తెలిపారు.

Roshini C/O Turpu Gadhi audio released

రోషిని కేర్ అఫ్ తూర్పు గది కార్యక్రమంలో ఛాంబర్ కోశాధికారి టీ రామ సత్యనారాయణ, నిర్మాత సాయి వెంకట్, జె వీ మోహన్ గౌడ్, జీవీకే తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X