చిరంజీవికి ‘ఖైదీ’...ఆదికి ‘రఫ్’ (ఫోటోలు)
హైదరాబాద్: ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రఫ్' చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగటింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్.సుదర్శనరావు మాధవరం సమర్పణలో శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ చిత్ర యూనిట్‌కి బెస్టాఫ్ లక్ చెప్పారు. హీరో ఆది మాట్లాడుతూ '' లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ హంగులు ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్ సుబ్బారెడ్డి సినిమాను చాలా బాగా తీసారు. నిర్మాత కూడా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు'' అని తెలిపారు.
డైరెక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ''సురేందర్ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ గా చేసాను. తన తొలి సినిమా నుంచి ఆది యాక్షన్ సీక్వెన్స్ ని బాగా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఆది చాలా చక్కగా చేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ పీక్స్ లో ఉంటాయి. రఫ్ లుక్ తో ఆది బాగుంటాడు. రకుల్ కూడా అద్భుతంగా నటించింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు'' అని చెప్పారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

చిరుకు ఖైదీ, ఆదికి ‘రఫ్'
''చిరంజీవిగారికి 'ఖైదీ', నాకు 'పోలీస్ స్టోరీ' యాక్షన్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. అలాగే ఆదికి 'రఫ్' యాక్షన్ ఇమేజ్ ని తెచ్చి పెడుతుంది. నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, అవన్ని దాటుకుని ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు'' అని తెలిపారు.

నిర్మాత అభిలాష్ మాట్లాడుతూ
''భారీ వ్యయంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు కె.కె.సెంధిల్ కుమార్ కెమెరా, మణిశర్మ సంగీతం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణ.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్'' అని చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు అక్టోబర్ 10న కావడంతో ఇదే వేడుకపై ఆమెతో కేక్ కట్ చేయించారు.నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు
శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, అదుర్స్ రఘు, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - మరుధూరి రాజా, పాటలు - భాస్కర భట్ల, ఫైట్స్ - రామలక్ష్మణ్, డ్యాన్స్ - బాబా భాస్కర్, భాను, ఆర్ట్ - సీతారామాంజనేయులు, ఎడిటర్ - మార్తాండ్ .కె.వెంకటేష్, డి.ఓ.పి - కె. కె.సెంధిల్ కుమార్, అరుణ్ కుమార్, సంగీతం - మణిశర్మ, నిర్మాత - ఎమ్.అభిలాష్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సి.హెచ్.సుబ్బారెడ్డి.


Click it and Unblock the Notifications











