ఆకట్టుకోలేని బిజినెస్ మేన్ క్లైమాక్స్?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన బిజినెస్ మేన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. సినిమా మొత్తం మహేష్ బాబు పవర్ ఫుల్ యాక్షన్, డైలాగులతో అదిరిపోయినప్పటికీ....క్లయిమాక్స్ మాత్రం రొటీన్ గా, ఆకట్టుకోలేని విధంగా ఉందని అంటున్నారు చాలా మంది. ప్రకాష్ రాజ్ హీరోయిన్ కాజల్‌ను కిడ్నాప్ చేయడం, హీరో మహేష్ బాబు వెళ్లి అతన్ని చంపి రివేంజ్ తీర్చుకోవడం రోటీనే అంటున్నారు. పైగా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం వాడిన లొకేషన్స్ కూడా సినిమా రేంజ్ కు తగిన విధంగా లేవంటున్నారు. క్లైమాక్స్ సంగతి పక్కన పెడితే సినిమా మాత్రం సూపర్ గా ఉందని అంటున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం మార్కు సినిమాలో స్పష్టంగా కనబడిందని, పోకిరి రేంజ్ సినిమా అని అభిమానులు సంబర పడిపోతున్నారు. ఇక పోతే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రం గొప్ప వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం ఖాయం. భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావడం, సినిమా హిట్ టాక్ రావడంతో ఈ బ్యానర్ లాభాల బాట పట్టినట్లే అంటున్నారు. థమన్ అందించిన సంగీతానికి మంచి పేరు రావడంతో పాటు సినిమా హిట్ కావడంతో మరోసారి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు థమన్.


Click it and Unblock the Notifications











