‘రొటీన్ లవ్ స్టోరీ’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: 'ప్రస్థానం', 'స్నేహగీతం' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా 'రోటీన్ లవ్ స్టోరీ'. 'ఎస్.ఎం.ఎస్.' ఫేం రెజీనా హీరోయిన్. వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్, బెంచ్ మార్క్ మూవీస్ బేనర్లపై చాణక్య బోనేటి, పి. మణికుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఎల్బీడబ్ల్యూ' ద్వారా దర్శకునిగా పరిచయమైన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజాగా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ నెల 23 ఈచిత్రం విడుదల కానుంది. ఇది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. రొటీన్ లవ్ స్టోరీని వెరైటీగా చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ" అని ప్రవీణ్ తెలిపాడు. హీరో సందీప్ ఇందులో 19 సంవత్సరాల కుర్రాడిగా నటిస్తుండటం విశేషం. హీరో ఓ లాజిక్ తో బతికేస్తుంటాడు. అదే లాజిక్ ని అప్లైచేసి ప్రేమలో ఎలా గెలుపొందాడనేది ఆసక్తికర అంశం అని చెప్పాడు సందీప్.

అలాగే ప్రేమకథలంటే కేవలం ద్వందర్థాల కథలు కాదు. అలా సినిమా చేయడమంటే దొడ్డిదారిలో డబ్బు సంపాదించడమే. కళను నమ్ముకొని సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఈ సినిమా చేశాను. ఇందులో ఎలాంటి ద్వందర్థాలు ఉండవు. రొటీన్ లవ్‌స్టోరీ అంటున్నారని ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వస్తారు. అలా వచ్చిన వారు వంద శాతం సంతృప్తితో హాయిగా నవ్వుకుంటూ బైటికి వెళ్ళే సినిమా ఇది.మనం వినే చాలా ప్రేమకథలు రొటీన్‌గా వుంటూ బోర్‌గా అనిపిస్తాయి. అందుకే మా చిత్రానికి 'రొటీన్ ప్రేమకథ' అని పెట్టాం. కానీ కథ నడిపించిన విదానం కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది అంటున్నాడు దర్శకుడు.

కృష్ణుడు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, హేమ, సురేఖావాణి, ఝాన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేశ్, ప్రగతి, హేమంత్, భరత్, స్నిగ్ధ, స్వప్నిక తారాగణం. ఈ సినిమాకి పాటలు: కృష్ణచిన్ని మాదినేని, సినిమాటోగ్రఫీ: సురేశ్/చోటా కె. నాయుడు, కూర్పు: ధర్మేంద్ర, ఆర్ట్: ఉపేంద్ర, కాస్ట్యూం డిజైనర్: శాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X