వెరైటీగా...(రొటీన్ లవ్‌స్టోరీ ప్రివ్యూ)
సంజూ (సందీప్ కిషన్), తన్వి (రెజీనా) ఇద్దరూ ప్రేమించుకొంటారు. చూసేవాళ్లకు మాత్రం ఇద్దరూ బద్ద శత్రువులేమో అనిపిస్తుంది. కొట్టుకొంటారు.. మళ్లీ కలిసిపోతారు. పెళ్లంటే ఇద్దరికీ సదభిప్రాయం లేదు. పెళ్లి చేసుకొంటే తమ మధ్య ప్రేమ పోతుందని... గట్టి నమ్మకం. అలా అనుకోవడానికి కారణం ఏమిటి? సంజూ, తన్వి ప్రేమికులుగానే ఉండిపోయారా? లేదంటే ఏడడుగులూ వేసే ప్రయత్నం చేశారా? అనేదే ఈ సినిమా కథ.
దర్శకుడు మాట్లాడుతూ ''18-20 ఏళ్ల మధ్య ఉన్న ఓ జంట ప్రేమ విషయంలో ఎలా స్పందించింది? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే విషయాల చుట్టూ అల్లుకొన్న కథ ఇది. 'ఇది మన కథే' అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. సన్నివేశాల్లో నాటకీయత ఉండదు''అన్నారు.
ఓ కొత్త ప్రేమ జంటకు పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండబోతోందో తెలిస్తే... వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. 18-40 మధ్య వయస్కుల మనోభావాలు ఇందులో కనిపిస్తాయి. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడూ కచ్చితంగా ఎక్కడో ఓ చోట తనకు తాను ఐడెంటిఫై చేసుకునే రీతిలో ఇందులో సన్నివేశాలు, పాత్రలు సాగుతాయి'' అని ప్రవీణ్ చెప్పారు.
సంస్థ: వర్కింగ్ డ్రీమ్
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా, వెన్నెల కిషోర్, చంద్రమోహన్, హేమ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, తాగుబోతు రమేష్ తదితరులు.
సంగీతం: మిక్కీ జె.మేయర్
పాటలు: కృష్ణచిన్ని మాదినేని,
సినిమాటోగ్రఫీ: సురేశ్/చోటా కె. నాయుడు,
కూర్పు: ధర్మేంద్ర,
ఆర్ట్: ఉపేంద్ర,
కాస్ట్యూం డిజైనర్: శాంతి,
నిర్మాత: చాణిక్య భూనేటి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












