For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డమరుకం' థియేటర్లలో 'రోటీన్ లవ్‌స్టోరి'

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున 'డమరుకం' చిత్రం రేపు(నవంబర్ 10)న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు 'రోటీన్ లవ్‌స్టోరి' ట్రైలర్ ని కూడా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని 'రోటీన్ లవ్‌స్టోరి' దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మీడియాకు తెలియచేసారు. 'రోటీన్ లవ్‌స్టోరి' చిత్రం ఈ నెల 23న విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. సందీప్ కిషన్, రెజీనా కెసాండ్రా జంటగా రూపొందుతున్న చిత్రం 'రొటీన్ లవ్‌స్టోరి'. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఎల్.బి. డబ్ల్యు.' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకుడు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చారు.

    దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ "ఇటీవల విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. అలాగే ట్రైలర్‌లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. సినిమాకి ఆడియో పెద్ద ఎస్సెట్. తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, నైజాం, ఈస్ట్ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చే వారంలో సెన్సార్ పనులు పూర్తవుతాయి. 'డమరుకం' సినిమా ప్రదర్శించే థియేటర్‌లలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

    హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ "మిక్కీ మ్యూజిక్ అంటేనే సక్సెస్ అనేది నా నమ్మకం. చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. హీరోగా నా మొదటి చిత్రానికి ఆయన సంగీతం అందించడం నా అదృష్టం. యువత అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది'' అన్నారు. ఈ నెల 23న చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామనీ, నైజాంలో వందకు పైగా థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నామనీ నిర్మాత చాణక్య తెలిపారు.

    రాళ్లపల్లి, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, సంజయ్‌రెడ్డి, కవిత, ఝాన్సీ, హేమ, మీనాకుమారి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్, నవీన్ నేని, స్వప్నిక, ఆర్.జె. భరత్, మాస్టర్ నిఖిల్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి. సురేశ్‌భార్గవ్, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, కళ: ఉపేందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అర్చన బూనేటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

    English summary
    Director Praveen Sattaaru, who has entertained the audience with a film like 'L.B.W., is working on. he has chosen Actor Sandeep Kishan who got into fame with the films like ‘Snehageetam’ and ‘Prasthaanam’ as his hero and Rejina as his heroine. His 'routine love story' involves all the elements like a boy meeting a girl, falling in love and the differences arising between them, but the treatment given to these elements stands out to be a highlight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X