twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బుతో ఫ్యాన్స్ రారు: చంద్రబాబురౌడీ ఫెలో (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ ఫెలో' అనే చిత్రం ఆడియో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ద్వారా సినీగేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నారా రోహిత్‌ సరసన విశాఖ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నందినీ రాయ్ సెకండ్ హీరోయిన్. మూవీ మిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సన్నీ యం. ఆర్ సంగీతం అందించారు.

    ఆడియో ఆవిష్కరణ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...'డబ్బు ఎంత ఉన్న అభిమానులను సంపాదించుకోలేం...అది కేవలం మంచి సినిమాల ద్వారానే సాధ్యం. రాజకీయాల్లో మంచి పనులు చేస్తే అభిమానులు తయారవుతారు. సినిమాలు అనేది మంచి వినోద సాధనం. వినోదం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. 'రౌడీ ఫెలో' రషెస్ చూశాను. రోహిత్ కి ఏడో సినిమా హిట్ గ్యారంటీ' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

    స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన వివరాలు...

    రాజకీయాల్లోనూ ఇలానే..

    రాజకీయాల్లోనూ ఇలానే..

    ‘రౌడీ ఫెల్లో' నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఒక నెగటివ్ టైటిల్ పెట్టి పాజిటివ్ స్టోరీతో ఈ సినిమా చేశారు. ఒక్కోసారి రాజకీయాల్లో కూడా ఇలానే చేస్తామని చంద్రబాబు తెలిపారు.

    సందేశాత్మక సినిమాలు తీయాలి

    సందేశాత్మక సినిమాలు తీయాలి

    వినోదంతో పాటు సందేశాత్మక చిత్రాలు కూడా తీయాలనేది నా అభిప్రాయం. నేడు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. అప్పట్లో ఎన్టీఆర్ సమాజానికి ఉపయోగపడే సినిమాలే చేశారు. అలాంటివి చేస్తే బాగుంటుందని చంద్రబాబు అన్నారు.

    బాలయ్య అభిమానుల గురించి

    బాలయ్య అభిమానుల గురించి

    నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెలుగు దేశం పార్టీ అభిమానుల ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరో రెండు గంటలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందంటూ చంద్రబాబు బాలయ్య అభిమానుల్లో మరింత జోష్ నింపారు.

    పెద్ద నాన్న వస్తే హిట్టే

    పెద్ద నాన్న వస్తే హిట్టే

    నారా రోహిత్ మాట్లాడుతూ ''మా పెదనాన్న అతిథిగా వస్తే.. సినిమా హిట్టే. రౌడీ ఫెలో కూడా హిట్ జాబితాలో చేరుతుంది. డైరెక్టర్ కృష్ణచైతన్యకు ధన్యవాదాలు. సన్నీ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు'' అన్నారు.

    కల నెరవేరింది

    కల నెరవేరింది

    కృష్ణచైతన్య మాట్లాడుతూ ''దర్శకుడు కావాలన్నది నా కల. ఈ చిత్రం ద్వారా నా కల నెరవేరింది. ఇంతకు ముందు నారా రోహిత్ నటించిన 'బాణం' కి పని చేశానని తెలిపారు.

    క్లైమాక్స్ హైలెట్

    క్లైమాక్స్ హైలెట్

    నటడు రావు రమేష్ మాట్లాడుతూ రౌడీ ఫెలో సినిమాలో నేను, రోహిత్ చేసిన ఏడు నిముషాల క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో నేను విలన్ రోల్ చేసాను. మంచి పాత్ర ఇచ్చినందుక డైరెక్టర్ కి థాంక్స్' అన్నారు.

    ఐదేళ్లు...

    ఐదేళ్లు...

    ఈ సినిమాతో నారా రోహిత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఐదేళ్లు పూర్తయింది.

    English summary
    Telugu Movie Rowdy Fellow Audio Launch event held at ShilpaKala Vedika, Hyderabad. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Nara Rohit, Vishakha Singh and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X