ఆన్‌లైన్లో రిలీజవుతున్న ‘రౌడీ ఫెల్లో’

By Bojja Kumar

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా గీతరచయిత కృష్ణ చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ ఫెలో'. ఈ చిత్రం రిలీజ్ డేట్ నవంబర్ 21న ఖరారైంది. ఈచిత్రాన్ని థియేటర్లతో పాటు ఆన్ లైన్లో ‘మైసెల్యూలాయిడ్' అనే వెబ్ సైట్ ద్వారా విడుదల చేస్తున్నారు. థియేటర్లలో విడుదల చేయడానికి అవకాశం లేని కొన్ని ఇతర దేశాల్లో ఆన్ లైన్లో విడుదల చేస్తారట. విడుదల నాడే అపీషియల్‌గా ఆన్ లైన్లో అందుబాటులోకి వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కాబోతోందని అంటున్నారు.

మూవీ మిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రౌడీ ఫెలో'. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను కొన్ని రోజుల క్రితం నిర్మాత ప్రకాష్ రెడ్డి తెలియజేస్తూ ‘ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వస్తోంది. సన్నీ.ఎం.ఆర్ అందించిన పాటలు అన్ని చార్ట్ బస్టర్స్‌లో నెంబర్ స్థానంలో ఉన్నాయి. పాటలు విన్న ప్రతి ఒక్కరూ మ్యూజిక్ డిఫరెంటుగా ఉంది అంటున్నారని తెలిపారు.

Rowdy Fellow leads the way

సినిమా కూడా అంతే కొత్తదనంగా ఫీలవుతారు. కొత్తదనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయం ఈ చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇటీవల గోవాలో హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ‘ఆ సీతాదేవి నవ్వులా..' అనే పాటతో పాటు ఎంతవారు గానీ పాటలతో చిత్రం షూటింగ్ పూర్తయింది. నవంబర్ 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. రావు రమేష్, పోసాని, అజయ్, సుప్రీత్, పరుచూరి వెంకటేశ్వరరావు, అజయ్, ప్రవీణ్, తాళ్లూరి రామేశ్వరి, గొల్లపూడి తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X