‘రౌడీ ఫెలో’ థియేట్రికల్ ట్రైలర్ అదరింది (వీడియో)
హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ ఫెలో' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. నారా రోహిత్ ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. నారా రోహిత్ సరసన విశాఖ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నందినీ రాయ్ సెకండ్ హీరోయిన్. ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం.
ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సినిమా రషెస్ బాగున్నాయని, పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చంద్రబాబు అన్నారు. హీరో నారా రోహిత్, దర్శకుడు కృష్ణ చైతన్యం సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.

గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రకాష్ రెడ్డి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ... 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











