మోహన్ బాబు విద్యా సంస్థలో ‘రౌడీ’ రాగాలు!
హైదరాబాద్: మెహన్ బాబు-మంచు విష్ణు వెండి తెరపై తండ్రీ కొడుకులుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'రౌడీ'. రాయలసీమ బ్యాక్ డ్రాపులో ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఎ.వి.పిక్చర్స్ పతాకంపై విజయ్ కుమార్, గజేంద్రనాయుడు, పార్థసారథి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జయసుధ, శాన్వి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కార్తీక స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకకు మోహన్ బాబు సొంత విద్యా సంస్థ అయిన శ్రీవిద్యా నికేతన్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక కోసం అక్కడి ఆడిటోరియంలో ప్రత్యేకంగా ఓ సెట్ వేసారని సమాచారం. మార్చి 20వ తేదీన ఈ ఆడియో వేడుక జరుగనుంది.

ఇప్పటికే 'రౌడీ' ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తుండగా, ఇటీవల విడుదల చేసిన మంచు విష్ణు-శాన్విలపై చిత్రీకరించిన 'నీ మీద ఒట్టు' పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. రాంగోపాల్ వర్మ స్టైల్‌లో తెరకెక్కిన ఈ పాట 'టాప్ రొమాంటిక్ సాంగ్స్ లిస్ట్' స్థానం దక్కించుకుంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
రౌడీ చిత్రాన్ని 28వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











