'విక్రమార్కుడు' హిందీ రీమేక్ షూటింగ్ ఆపివేత
రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన విక్రమార్కుడు చిత్రం హిందీలో రాడీ రాధోడ్ టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్...హంపీలో ఆపుచేసారు. పెద్ద వివాదం జరిగి...ముదిరి ఒత్తిడి రావటంతో అక్కడ పాట చిత్రీకరిద్దామనుకున్న ప్రభుదేవా వెనుతిరిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రౌడీ రాథోడ్' హిందీ చిత్రానికి కర్నాటక సినీ ఆర్టిస్టుల సెగ తగిలింది. అక్షయ్ కుమార్, సొనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెం సాంగును సొనాక్షి కోరికపై కర్ణాటకలోని హంపి క్షేత్రంలో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.
హీరో హీరోయన్లతోబాటు 50 మంది డ్యాన్సర్లపై ఈపాట చిత్రీకరణను ప్రారంభించగానే, హంపీలోని స్థానిక కార్మికులు వచ్చి అభ్యంతరం చెప్పారు. తమ సేవలు ఉపయోగించుకోవాలని వారు ప్రభుదేవాను కోరారు. అయితే అందుకు ఆయన నిరాకరించడంతో వారెళ్లి కర్నాటక సినీ ఆర్టిస్టులను కూడా తీసుకురావడంతో సమస్య మరింత ముదిరింది. స్థానిక కళాకారులకు కూడా ఆ షూటింగ్‌లో అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో షూటింగ్ జరగనివ్వమని వారు కరాఖండిగా చెప్పారు. దాంతో చేసేది లేక షూటింగ్ ప్యాకప్ చెప్పి, యూనిట్ సభ్యులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో .హంపీలో ఆ పాట చిత్రీకరణ కోసం ముచ్చటపడిన కథానాయిక సొనాక్షి ఆశ ఆ విధంగా నిరాశ అయింది.
హిందీలో మెగా బడ్జెట్ తో విక్రమ్ రాధోడ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో ఐటం సాంగ్ కోసం పెళ్లైన హీరోయిన్ కరిష్మాకపూర్ ఐటం సాంగ్ ని ప్లాన్ చేసారు కానీ చివరి నిమషంలో విరమించుకున్నారు. 'చిక్నీ ఛమేలీ' తరహాలోనే ఈ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మున్ని బద్‌నామ్', 'షీలా కీ జవానీ', 'చిక్నీ ఛమేలీ'..తరహాలో ఈ పాట సూపర్ హిట్టవుతుందని చెప్తున్నారు. అలాగే జూన్ 15న 'రౌడీ రాథోడ్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,సోనాక్షి సిన్హా కలిసి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.


Click it and Unblock the Notifications











