బెల్లంకొండపై రౌడీషీట్ తెరిచే అవకాశం?

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండపై రౌడీషీట్ తెరిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయనపై దాదాపు 8 కేసులు నమోదయ్యాయి. అందులో బంజాహిల్స్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు కాగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. తాజాగా బెల్లంకొండ ఫైనాన్సియర్ రాధాకృష్ణపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే కేసు నమోదైన ఈ నేపథ్యంలో ఆయనపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

రాధాకృష్ణపై దాడి కేసు విషయాని కొస్తే....బెల్లకొండ సురేష్ ప్రస్తుతం సిద్ధార్థ-సమంత హీరో హీరోయిన్లుగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'జబర్దస్త్' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్ ప్రదర్శన హక్కుల కోసం ఫైనాన్సియర్ రాధాకృష్ణ బెల్లంకొండకు రూ. 25 లక్షలు చెల్లించాడు. అయితే ఏమైందో తెలియదు కానీ అగ్రిమెంటు విషయంలో ఇరు వురి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తీవ్రంగా వాదులాడుకున్నారని, బెల్లంకొండ కోపం ఆపుకోలేక అతనిపై దాడి చేసాడని తెలుస్తోంది. దీంతో రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

జబర్దస్త్ సినిమా వివరాల్లోకి వెళితే... సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇప్పటికే పూర్తయింది. జనవరి 27న హైదరాబాద్ లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X