twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్రి అందుకే చనిపోయాడు, తేజతో గొడవల్లేవ్, పవన్ మూవీ వదులుకున్నా: ఆర్పీ పట్నాయక్

    By Bojja Kumar
    |

    తెలుగులో ఒకప్పుడు సంగీత దర్శకుడిగా తన హవా కొనసాగించిన ఆర్పీ పట్నాయక్ తర్వత దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడిగా మారిన తర్వాత ఆయన సంగీతం చేయడం మానేశారు. తనదైన ప్రత్యేకతతో దర్శకుడిగా సినిమాలు చేస్తూ ముందుకెళుతున్నారు. హాలీవుడ్లో కూడా ఆయన ఓ సినిమా చేయడం విశేషం. తాజాగా అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్పీ పట్నాయక్ తన మనసులోని చాలా విషయాలు విప్పారు.

    కారణం వారే అయుండొచ్చు

    కారణం వారే అయుండొచ్చు

    సంగీత దర్శకుడిని కావాలన్న ఐడియా పీజీ చదువుతున్నపుడే వచ్చింది. చిన్నప్పటి నుండి ఇళయరాజా పాటలు, బాలు గారి వాయిస్, ఆర్డీ బర్మన్ పాటలు వింటూ పెరిగాను. అవి నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. బహుశా వాటి వల్లే ఇన్స్‌స్పైర్ అయ్యానేమో అని ఆర్పీ తెలిపారు.

    బాలుగారి వరకు వెళ్లక ముందే రిజక్ట్ అయ్యా

    బాలుగారి వరకు వెళ్లక ముందే రిజక్ట్ అయ్యా

    పాడుతా తీయగా కోసం ప్రయత్నించిన మాట నిజమే. అయితే బాలు గారి వరకు వెళ్లక ముందే జరిగిన స్క్రుటినీలోనే రిజెక్ట్‌ అయ్యా. సంగీత దర్శకుడిని కాక ముందు ‘ఆనందం' అని ఓ ప్రైవేటు ఆల్బమ్‌ చేశాను. దానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లిరిక్స్ రైటర్, ఆయన నా రూమ్మేట్ కూడా అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

    రూమ్మేట్ అయినా... త్రివిక్రమ్ అవకాశం ఇవ్వక పోడంపై

    రూమ్మేట్ అయినా... త్రివిక్రమ్ అవకాశం ఇవ్వక పోడంపై

    త్రివిక్రమ్ తొలి సినిమా ‘నువ్వే నువ్వే'. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌లో వచ్చింది. ఆ బేనర్‌కు అఫీషియల్‌ సంగీత దర్శకుడు కోటిగారు. చాన్స్ ఇవ్వమని అడగాలనుకుంటే అప్పుడే అడిగి ఉండేవాడిని, కానీ అవకాశం ఇవ్వమని అడగటం కరెక్ట్ కాదు. ఆర్పీ కరెక్టా? కాదా? అని తను డిసైడ్ అవ్వాలి. ఆర్పీ అయితే 99శాతం న్యాయం అవుతుంది. మరో సంగీత దర్శకుడు అయితే 100శాతం న్యాయం చేకూరుతుందని అనుకున్నప్పుడు ఇంకొక సంగీత దర్శకుడికే వెళ్లాలి అనేది నా ఫీలింగ్..... అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

    Recommended Video

    2017-దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. సందడి చేసిన స్టార్స్!
    అందుకే ఎవరినీ ఛాన్స్ ఇవ్వమని అడగను

    అందుకే ఎవరినీ ఛాన్స్ ఇవ్వమని అడగను

    నాకు అవకాశం ఇవ్వాలి అని ఎవరినీ అడగను. అది తప్పు అవుతుంది. నేను అబ్లిగేషన్ అవుతాను. ఇతడు కాకుండా ఇంకొకరు అయితే బావుండు అనే ఫీలింగ్ వారికి రాకూడదు. వాళ్లంతట వారే ఎస్
    హి ఈజ్ రైట్ అని ఎప్పుడైతే అనుకుంటారో... అపుడు నా నుండి 100 శాతం ఎక్స్ పెక్ట్ చేస్తారని నా ఫీలింగ్.... అని ఆర్పీ తెలిపారు.

    అందుకే దర్శకత్వం వైపు వచ్చా

    అందుకే దర్శకత్వం వైపు వచ్చా

    చిన్నప్పటి నుంచి దర్శకత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది. సడెన్ గా మ్యూజిక్ ఆపేసి డైరెక్టర్ అవుదామనే ఉద్దేశం కాదు. సంగీత దర్శకుడు అనేవాడు చీఫ్‌ టెక్నీషియన్‌ మాత్రమే. కానీ దర్శకుడు కెప్టెన్‌. ఒక మేనేజర్‌కు సీఈవోకు ఉన్న తేడా అదే. డైరెక్టర్ గా చెప్పాల్సింది చాలా ఉందని నా ఫీలింగ్. ఒక పాటలో దర్శకుడి థాట్‌కు ఏం కావాలో అదే చెప్పగలం. కానీ, దర్శకుడిగా నేను ఏం కావాలో అదే చెప్పగలను. అందుకే దర్శకత్వం వైపు వచ్చాను అని ఆర్పీ తెలిపారు.

    తొలి అవకాశం అలా వచ్చింది

    తొలి అవకాశం అలా వచ్చింది

    సంగీత దర్శకుడిగా తొలి సినిమా అవకాశం చంద్రసిద్ధార్థ్‌ దర్శకత్వంలో వచ్చింది కానీ ఆ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. అప్పుడు ‘నీ కోసం' చిత్రం షూటింగ్ నడుస్తోంది. దానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కొంటెబాబు అనే పాట కూడా కంపోజ చేశాడు. అపుడు సినిమా ఆర్టిక కష్టాల్లో ఉంది. చెన్నైవెళ్లి పాటలు రికార్డింగ్ చేయించుకునే స్థోమత కూడా లేదు. దాంతో మిగిలిన పాటలు నాతో చేయించుకున్నారు. చంద్ర సిద్ధార్థ్ సినిమా కోసం చేసిన రెండు పాటలు రికార్డింగ్ అయి రెండీగా ఉన్నాయి. ఆ పాటలు నీ కోసం సినిమాలో వాడేశారు. అవి నచ్చడంతో మిగిలిన పాటల్నీ నాతో చేయించారు. తర్వాత నన్నే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని చేశారు. అలా నా తొలి సినిమా మొదలైందని ఆర్పీ తెలిపారు.

    హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం

    హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం

    హాలీవుడ్లో ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. ఒక డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నాం. ఆమిష్‌ నేపథ్యంలో అది సాగుతుంది. అమెరికాలోని ఇండియానా, పెన్సిల్వేనియా, ఓహియోలో ఆమిష్ అనే కమ్యూనిటీ ఉంది. అమెరికాలో గుర్రపు బగ్గీలో తిరిగే, విద్యుత్ వాడని, ఆధునికతకు దూరంగా ప్రకృతిలో జీవించే వార ఆమిష్ పీపుల్. వాళ్ల లైఫ్‌స్టైల్‌ తెలుసుకుని వారిపై స్టడీ చేసి సినిమా చేద్దామని డిసైడ్ చేశాము. ‘బ్లూలాగూన్‌' చిత్ర కథానాయకుడు క్రిస్టోఫర్‌ అందులో నటించారు అని ఆర్పీ తెలిపారు.

    చక్రి అందుకే చనిపోయాడు

    చక్రి అందుకే చనిపోయాడు

    నాకు, చక్రికి తీవ్రమైన పోటీ ఉండేదని, ఒకరి వద్ద పని చేసిన వారిని మరొకరి వద్దకు రానివ్వరు అనే ప్రచారంలో నిజం లేదు. చక్రి నేను చాలా క్లోజ్‌. అతడు ఊబకాయంతో బాధపడుతున్నప్పుడు సింగపూర్‌ వెళ్లమని సలహా ఇచ్చను. చాలా పనులు ఉన్నాయంటే నీ పనులు నేను చూసుకుంటానని కూడా చెప్పాను. మా మధ్య అంత చనువు ఉండేది. కానీ చక్రి ఊబకాయాన్ని నెగ్లెక్ట్ చేశాడు. అందుకే అతడు చనిపోయాడు అని... ఆర్పీ తెలిపారు.

    నేనొక్కడినే సినిమా కోసం చేస్తున్నా

    నేనొక్కడినే సినిమా కోసం చేస్తున్నా

    ఇండస్ట్రీలో నేను ఒక్కడినే సినిమా కోసం పనిచేస్తున్నా. మిగిలిన వాళ్లు సినిమా, రియల్‌ఎస్టేట్‌. షేర్లు రకరకాల పడవలపై ప్రయాణిస్తున్నారు. నాకు సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. నేను కేవలం సినిమాను మాత్రమే నమ్ముకున్నాను అని ఆర్పీ తెలిపారు.

    అలా భావించే వారికి నేను చెప్పేది ఒక్కటే

    అలా భావించే వారికి నేను చెప్పేది ఒక్కటే

    చాలా మంది నన్ను దర్శకత్వం చేయక పోయినా సంగీతం చేయమని అడుగుతుంటారు. కొందరు ఫోన్‌లు చేసి తిడుతున్నారు కూడా. ఇండస్ట్రీలో నా గురించి ఓ ప్రచారం మొదలైందని తెలిసింది. ‘ఆర్పీ దర్శకుడు అయిపోయాడు.. అతడికి సంగీతం ఛాన్స్ ఇస్తే తను డైరెక్షన్‌లో వేలు పెడతాడేమో. వద్దులే' అని అనుకుంటున్నారట. కానీ నేను అలా చేయను. నేను సంగీతం అందించడం కరెక్ట్ అని ఎవరైనా అనుకుంటే వారికి చేయడానికి సిద్ధమే.... అని ఆర్పీ తెలిపారు.

    ఆ సినిమాకు నా సొంత డబ్బు పెట్టాను

    ఆ సినిమాకు నా సొంత డబ్బు పెట్టాను

    జగపతిబాబు నటించిన ‘స్వాగతం' సినిమాకు సొంత డబ్బు పెట్టిన మాట నిజమే. ఆ సినిమా బడ్జెట్‌లో లిమిటేషన్స్‌ ఉన్నాయి. సాంగ్స్‌ అయిపోయాయి కానీ, రీరికార్డింగ్‌ పూర్తికాలేదు. ‘కీబోర్డు ప్లేయర్లు' నచ్చలేదంటూ మార్చుకుంటూ వెళ్లే సరికి బడ్జెట్‌ పెరిగిపోయింది. దీంతో కారు అమ్మేసి నేనే డబ్బులు రూ. 6 లక్షలు ఇచ్చా అని ఆర్పీ తెలిపారు.

    నాగ్ మూవీ నుండి ఎందుకు తీసేశారో తెలియదు, హర్ట్ అయ్యారేమో?

    నాగ్ మూవీ నుండి ఎందుకు తీసేశారో తెలియదు, హర్ట్ అయ్యారేమో?

    ‘నేనున్నాను' మూవీ నుండి నన్ను సడెన్ గా తీసేశారు. ఇంతవరకూ దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య నాకు కారణం చెప్పలేదు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ సమయంలో నిర్మాత కూడా వచ్చి కూర్చున్నారు. అప్పుడు నేను ‘మీరెందుకులెండి.. మేమిద్దరం చూసుకుంటాం' అన్నా. అందుకు ఆయన హర్ట్‌ అయి నన్ను సినిమా నుంచి తప్పించారేమోనని భావిస్తున్నా. నేను అలా అన్నందుకు ఆయన హర్ట్ అయి ఉంటే సారీ.... అని ఆర్పీ తెలిపారు.

    అందుకే పవన్ కళ్యాణ్ మూవీ వదులుకున్నా

    అందుకే పవన్ కళ్యాణ్ మూవీ వదులుకున్నా

    పవన్ కళ్యణ్ గుడుంబా శంకర్ సినిమా ఒప్పుకోకముందే యూఎస్‌ టూర్‌ కమిటయ్యాను. సినిమా ఒప్పుకొన్న తర్వాత యూఎస్‌ టూర్‌ షెడ్యూల్‌ను మార్చుకునే పరిస్థితి లేదు. దాంతో సినిమా వదులుకున్నాను. దాంతో వాళ్లు ఫీలయ్యారు. నన్ను పక్కన పెట్టి మణిశర్మతో సంగీతం చేయించుకున్నారు అని ఆర్పీ తెలిపారు.

    తేజతో గొడవల్లేవు

    తేజతో గొడవల్లేవు

    తేజతో నాకు గొడవ అయిందని, అందుకే మా లింక్ కట్టయిందని కొందరు అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. ఆయన సినిమాకు నేను కరెక్ట్ అనుకుంటే తీసుకుంటారు. మేము తరచూ కలుస్తూనే ఉంటాం... అని ఆర్పీ తెలిపారు.

    English summary
    RP Patnaik about his cinema journey. Ravindra Prasad Patnaik is a South Indian music composer with about 60 films to his credits in three south Indian languages. He won three Filmfare Awards and three Nandi Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X