twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు నాశనం అయిపోతారు అన్నాడు: దొంగగా మారిన కులశేఖర్ గురించి ఆర్పీ!

    |

    ప్రముఖ తెలుగు లిరిసిస్ట్ కులశేఖర్ ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు అగ్రహీరోల సినిమాలకు పని చేసిన కులశేఖర్ వంద సినిమాలకు పైగా పాటలు రాశారు. అయితే ఆయన ఊహించని విధంగా సినిమా రంగానికి దూరం కావడం, దొంగగా మారడం అందరినీ షాక్‌కు గురి చేసింది. మానసిక పరిస్థితి సరిగా లేక పోవడం వల్లే ఆయన ఇలా మారినట్లు తెలుస్తోంది.

    తాజాగా కులశేఖర్ గురించి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'చిత్రం' సినిమా ముందు నుంచే నాకు కులశేఖర్ పరిచయం. ఈ సినిమాలో కుక్కకావాలి సాంగ్ గురించి తేజ చాలా మంది రిలిక్ రైటర్లతో ట్రై చేశారు. ఎవరితో చేసినా అది వర్కౌట్ కావడం లేదు. అపుడు నేను కులశేఖర్ గురించి చెప్పాను... ఆయన ఆ సినిమాకు పని చేయడంతో మా సినిమాల జర్నీ మొదలైంది అని ఆర్పీ గుర్తు చేసుకున్నారు.

    కుల శేఖర్ వల్లే తేజతో బంధం తెగిపోలేదు

    కుల శేఖర్ వల్లే తేజతో బంధం తెగిపోలేదు

    ‘‘ఆ సమయంలో నేను హిందీ ఆల్బం చేస్తున్నాను. ఆ పనిలో ఉండి తేజకు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేదు. లిరిక్ వచ్చిన తర్వాత నేను ట్యూన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఒకానొక సమయంలో తేజకు కోపం వచ్చి ఆర్పీని తీసేసి వేరే వారిని పెట్టుకుందాం, ఆర్పీకి ఈ సినిమా మీద ఇంట్రస్టు లేదు, చిన్న బడ్జెట్ సినిమా అనుకుంటున్నాడేమో? అని వేరొకరి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కులశేఖర్ వచ్చి కుక్కకావాలి లిరిక్ ఇచ్చిన తర్వాత.... తేజ మళ్లీ నాతో పని చేయాలని నిర్ణయించుకున్నారు'' అని ఆర్పీ గుర్తు చేసుకున్నారు.

    కులశేఖర్ మైనస్ పాయింట్

    కులశేఖర్ మైనస్ పాయింట్

    ఇద్దరం కలిసి చాలా సినిమాలకు ట్రావెల్ చేశాం. చాలా సినిమాలకు ఇద్దరికీ పేమెంట్స్ రాని సమయంలో కలిసి ఫైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కులశేఖర్‌లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్..... ఇది చెబితే కుల శేఖర్‌కు మైనస్ అవ్వొచ్చు, నా గురించి కూడా జనం మైనస్ అనుకోవచ్చు. కానీ నెక్ట్స్ జనరేషన్ కు ఏమైనా హెల్ప్ అవుతుందనే ఈ విషయం చెబుతున్నాను అంటూ అసలు విషయం వెల్లడించారు ఆర్పీ.

    ఆగ్రహంతో ఊగిపోయాడు

    ఆగ్రహంతో ఊగిపోయాడు

    కులశేఖర్ తాను లిరిక్ రాసిన తర్వాత తాను పాడి వినిపిస్తాడు. తనకంటూ ఓ ట్యూన్ ఉంటుంది. ‘ఢిల్లీ నుంచి గల్లీ దాకా' అనే పాట రాసిన తర్వాత తన ట్యూన్లో వినిపిస్తున్నాడు. ఆ సమయంలో నేను, నిహాల్, తేజ‌గారు కూడా ఉన్నారు. వాస్తవానికి ట్యూన్ అది కాదు... ఆయన స్టైల్‌లో పాడుతుంటే మాకు నవ్వొచ్చింది. దీంతో ఆయన సీరియస్ అయిపోయాడు. ఒక కళాకారుడిని మీరు అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు... అని ఆర్పీ గుర్తు చేసుకున్నాడు.

    నాశనం అయిపోతారు అన్నాడు

    నాశనం అయిపోతారు అన్నాడు

    ‘‘ఇది మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కాదు... మీ లిరిక్ బాలేదని మేము చెప్పలేదు కదా, ఆ ట్యూన్ పాడే విధానం మాకు నవ్వు తెప్పించింది అన్నారు. మేము ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. ఎంత సీరియస్ అయిపోయాడంటే మా లాంటి వారితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు అనే రేంజింలో ఆయన నోటి నుంచి మాట వచ్చింది. తనకు తెలియకుండా ఒక కోపం వచ్చేసరికి ఆ ఆవేశంలో నుంచి మనం ఊహించని వ్యక్తి బయటకు వస్తాడు.... అదే అతడిలోని పెద్ద మైనస్ పాయింట్ అని ఆర్పీ అన్నారు.

    ఎప్పుడూ నెగెటివ్‌గా తీసుకోలేదు

    ఎప్పుడూ నెగెటివ్‌గా తీసుకోలేదు

    ఆవేశం తగ్గిన తర్వాత కులశేఖర్ రియలైజ్ అయ్యేవాడు. కానీ ఆయన మీద నెగెటివ్ ఇంప్రెషన్ అలా పడిపోయేది. ఆయన కోపాన్ని నేనెప్పుడూ నెగెటివ్‌గా తీసుకోలేదు. నా జీవితంలో నా గురించి ఓ పత్రికలో అద్భుతమైన లైన్స్ రాసింది ఎవరంటే అది కులశేఖరే. అంతకన్నా గొప్ప లైన్స్ నా లైఫ్ లో ఎవరూ రాయలేరు అని ఆర్పీ గుర్తు చేసుకున్నారు.

    కోమాలోకి వెళ్లి బయటకు వచ్చారు

    కోమాలోకి వెళ్లి బయటకు వచ్చారు

    కులశేఖర్ కొంతకాలం కోమాలోకి వెళ్లి బయటకు వచ్చారు. 9 నెలల పాటు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా గుర్తు పట్టని పరిస్థితిలో కొంతకాలం ఉన్నారు. యోగాకు వెళ్లిన తర్వాత క్రమక్రమంగా ఆయన మామూలు స్థితికి వచ్చారు. కొంతకాలం తర్వాత ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన్ను పట్టుకోవడం కష్టమైంది. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఉండేదని తెలిపారు.

    English summary
    RP Patnaik about Lyricist Kulasekhar. Kulasekhar, known for some very popular songs in Tollywood, was arrested for stealing a silver crown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X