ప్రకృతి వైపరిత్యాలు వల్లే ఆర్పీ 'బ్రోకర్' విడుదల వాయిదాట
ఆర్పీ పట్నాయక్ టైటిల్ పాత్రలో నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'బ్రోకర్'. ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. కానీ విడుదల తేదీలో మార్పు చేస్తున్నామని, ఈ నెల 31న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత మద్దినేని రమేష్ మీడియాకు తెలిపారు.అలాగే వాయిదాకు కారణం చెపుతూ.. "ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని 'బ్రోకర్' విడుదల తేదీని ఈ నెల 31కి వాయిదా వేశాం. మంచి సినిమాను అందరూ చూడాలన్న సదుద్దేశంతోనే ఈ మార్పులు చేశామ"ని అన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని వారన్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన 'బొమ్మరిల్లు" చిత్రానికి అంతకుముందు, 'ఒక్కడు" చిత్రానికి ఎలాంటి నెగిటివ్ టాక్ రాలేదు. ఆ కోవలో మా చిత్రం కూడా చేరబోతోంది, అవినీతి మీద ఇంత నిజాయితీగా సినిమా ఎవరూ తీయలేదని ప్రశంసలు లభించాయని తెలిపారు.
ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించారు. మయూరి, కీర్తిచావ్లా, అర్చన హీరోయిన్స్. డైరక్టర్స్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక వాయిదాకు అస్సలు కారణం ప్రకృతి కాదని మార్కెట్ కాకపోవటమేనని ఫిల్మ్ నగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











