twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్పీ పట్నాయిక్ ‘బ్రోకర్’ గా మారేదెప్పుడంటే...

    By Srikanya
    |

    శ్రీహరి, ఆర్.పి.పట్నాయక్, ఆశాషైనీ (మయూరి) ప్రధానపాత్రలుగా రూపొందిన 'బ్రోకర్" చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ...సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇటీవలి కాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని, రాష్ట్ర, దేశంలో ఈ చిత్రానికి అవార్డులు అందుకునేంతగా కథాకథనం ఉందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని వారన్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన 'బొమ్మరిల్లు" చిత్రానికి అంతకుముందు, 'ఒక్కడు" చిత్రానికి ఎలాంటి నెగిటివ్ టాక్ రాలేదు. ఆ కోవలో మా చిత్రం కూడా చేరబోతోంది, అవినీతి మీద ఇంత నిజాయితీగా సినిమా ఎవరూ తీయలేదని ప్రశంసలు లభించాయని తెలిపారు. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న అవినీతిపరుడి క్యారెక్టర్ ని ఆర్పీ పోషిస్తున్నారు. చాలా తెలివైనవాడు, అవకాశం కోసం ఎంతకైనా తెగించే పాత్ర అది.

    డైరెక్టర్స్ సినిమా పతాకంపై ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో మద్దినేని రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్చన, కీర్తి చావ్లా, సురేష్, కౌశ, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎంవిఎస్ హరనాథరావు, పాటలు: చైతన్యప్రసాద్, నిర్వహణ: జి.భరత్‌కుమార్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X