twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దళారీ వ్యవస్ధ విశ్వరూపం ( 'బ్రోకర్' ప్రివ్యూ)

    By Srikanya
    |

    'శీను వాసంతి లక్ష్మి' చిత్రంతో నటుడుగా మారిన ఆర్‌.పి.పట్నాయక్‌ మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తూ, సంగీతం, దర్శకత్వం వహించిన 'బ్రోకర్' ఈ రోజు(డిసెంబర్ 31, 2010) విడుదల అవుతోంది. కథ ప్రకారం..గణపతి (ఆర్‌.పి.పట్నాయక్‌) ఎంతటి వ్యవహారాన్నైనా విఘ్నాలు లేకుండా చేయించగల దిట్ట. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఎలా అవుతాయో తెలిసిన బ్రోకర్‌. అక్కడికొచ్చే అవసరార్థులకు, అధికారికీ మధ్య వారధిలా ఉంటాడు. అయితే తను చేసే ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుంది. గణపతికి ఎవరెవరితో సంబంధాలున్నాయి. అతను చేసిన పనుల పర్యవసానాలేమిటో తెర మీదే చూడా లంటున్నారు. ఈ చిత్రం గురించి ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ...సమాజంలో వేళ్లూనుకుపోయిన దళారీ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. బ్రోకర్లు సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసే వైనాన్ని తెరపై ఆవిష్కరించాం. నేటి పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది అన్నారు.

    నిర్మాత మద్దినేని రమేష్ ఈ చిత్రం గురించి చెబుతూ...అవసరానికీ, అవకాశానికీ వారధి మా బ్రోకర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రోకర్ అనేవాడు లేకుండా మనిషి మనుగడ అసాధ్యం. ఓ పవర్ బ్రోకర్ తన స్వార్థం కోసం చేసిన పనిలో తనే ఎలా ఇరుక్కుపోయాడు? దాన్నుంచి బయటపడేందుకు ఏం చేశాడు? ఆ క్రమంలో మిగతా బ్రోకర్లకీ, సమాజానికీ ఎలాంటి సందేశాన్నిచ్చాడు? అనేది కథాంశం. స్క్రీన్‌ప్లే ఈచిత్రానికి ప్రధాన బలం. గొప్ప స్క్రీన్‌ప్లే. చివరిదాకా మనల్ని కుర్చీల్లో కదలకుండా కూర్చోపెట్టేది అదే. ప్రభుత్వాధికారి పాత్రలో శ్రీహరి గొప్పగా చేశారు. ఇలాంటి పాత్ర చేయడం ఆయనకి కొత్త. క్లైమాక్స్‌లో తన నటనతో ఆయన కంటతడి పెట్టిస్తారు. ఆయన పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. మీడియా అనేది కొంతవరకే వెళ్లగలుగుతుంది. అది ప్రవేశించలేని చోటుల్లోకి వెళ్లేవాడే బ్రోకర్. ఆ పాయింట్ హైలైట్ అవుతుంది అన్నారు.

    సంస్థ: డైరెక్టర్స్‌ సినిమా
    నటీనటులు: ఆర్‌.పి.పట్నాయక్‌, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, కాశీవిశ్వనాథ్‌, చలపతిరావు, మయూరి, అర్చన, కీర్తిచావ్లా, కౌశ తదితరులు
    నిర్మాత: మద్దినేని రమేష్‌
    సంగీతం-దర్శకత్వం: ఆర్‌.పి.పట్నాయక్‌
    విడుదల: శుక్రవారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X