»   » 'మనలో ఒకడు' గా వస్తున్న ఆర్పీ

'మనలో ఒకడు' గా వస్తున్న ఆర్పీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ లో మంచి నటుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. 'శీను వాసంతి లక్ష్మి', 'బ్రోకర్' వంటి చిత్రాల్లో నటుడిగా భేష్ అనిపించుకున్నారు ఆర్పీ. 'బ్రోకర్', 'ఫ్రెండ్స్ బుక్', తులసీ దళం' వంటి చిత్రాలు ఆర్పీలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించాయి.

ప్రస్తుతం ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మనలో ఒకడు'. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయిక. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ తో ఈ చిత్రం 90 శాతం పూర్తయింది.

 RP Patnaik New Movie Manalo Okkadu details

ఈ సందర్భంగా నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ - ''కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ కథ ఇది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ గారు దర్శకత్వం వహించిన 'బ్రోకర్' ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాన్ని మించే స్థాయిలో ఉంటుంది' అన్నారు.

'ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఒక పాట, క్లయిమ్యాక్స్ మినహా సినిమా పూర్తయింది. ఈ నెల 16నుంచి నెలాఖరు వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం'' అని చెప్పారు.

 RP Patnaik New Movie Manalo Okkadu details

సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీముఖి, రఘుబాబు, బెనర్జి, గొల్లపూడి మారుతీరావు, రాజా రవీంద్ర, 'జెమిని' సురేశ్, దువ్వాసి మోహన్, సందేశ్, గిరిధర్, వరుణ్, గుండు సుదర్శన్, కృష్ణవేణి, 'జబర్దస్త్' రాకేశ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె. సిధ్ధార్ధ్, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: కృష్ణ, మాటలు: తిరుమల్ నాగ్,సహనిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత: జి.సి. జగన్ మోహన్, కథ-స్ర్కీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్.పి. పట్నాయక్.

English summary
when Anitha doing Nuvvu nenu with uday kiran and teja’s movie , that time R.p patnaya was a music director. now anitha doing movie with R.p patnaya. R.p and anitha working together in Manalo okkadu. before this Rp down broker and broker2 like that good movies. ofter long time R.p comming with manalo okkadu . this also a back dorp of curreption in society.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu